Latest Updates
-
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.!
గర్భిణీలు సెక్స్ లో పాల్గొనవచ్చా? సెక్స్ చేసుకోవొచ్చా? ఎలాంటి భంగిమలు ఉత్తమం
చాలా మంది గర్భిణీలు ప్రెగ్నెన్సీ సమయంలో ఫింగరింగ్ చేసుకోవాలా వద్దా అని సందేహపడుతుంటారు. అలాగే సెక్స్ లో పాల్గొనవచ్చా లేదా అనే అనుమానం కూడా వెంటాడుతుంది. డాక్టర్స్ సలహా మేరకు సెక్స్ లో పాల్గొనవచ్చు.
అమ్మతనం కన్నా గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అయితే ఈ కాలం అమ్మాయిలు ప్రెగ్నెంట్ కాగానే చాలా భయపడిపోతారు. ఒకవైపు తల్లి అవుతున్నామనే ఆనందం మనస్సులో ఉన్నా మరో వైపు ఏవేవో సందేహాలతో సతమతం అవుతూ ఉంటారు. అయితే ప్రెగ్నంట్ అయ్యాక ఏ పనులు చెయ్యాలి ఏ పనులు చేయకూడదనే విషయాలపై కాస్త అవగాహన కలిగి ఉండడం మంచిది.

వ్యాయామం చేయొచ్చు
గర్భిణీలు వ్యాయామం చేయకూడదని కొందరు అంటూ ఉంటారు. కానీ సరైన వ్యాయామం చేయడం వల్ల కడుపులోని బిడ్డ బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు ఎక్కువ చేయడం మంచిది. వీటి వల్ల తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే బలమైన వ్యాయామాలు చేయకపోవడం శ్రేయస్కరం.

కాఫీ
కాఫీ తాగే విషయంలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా కాఫీ తాగితే బిడ్డపై ప్రభావం పడుతుంది. అందువల్ల తక్కవ మోతాదులో అంటే రెండొందల మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోకుండా జాగ్రత్తపడాలి.

పిల్లులు
చాలా మంది గర్భిణీలు ఇంట్లోని కుక్కలు, పిల్లులతో గడుపుతుంటారు. అలా చేయడం మంచిది కాదు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాటి వల్ల మీరు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది.

ఫింగరింగ్, సెక్స్
చాలా మంది గర్భిణీలు ప్రెగ్నెన్సీ సమయంలో ఫింగరింగ్ చేసుకోవాలా వద్దా అని సందేహపడుతుంటారు. అలాగే సెక్స్ లో పాల్గొనవచ్చా లేదా అనే అనుమానం కూడా వెంటాడుతుంది. డాక్టర్స్ సలహా మేరకు సెక్స్ లో పాల్గొనవచ్చు. కానీ పొజిషన్స్ పై అవగాహన ఉండాలి. గర్భిణీలకు అన్ని భంగిమల్లో అందులో పాల్గొనడానికి వీలుకాదు.

భారం కాని భంగిమలో
అందువల్ల బిడ్డకు భారం కాకుండా ఉండే భంగిమలో అందులో పాల్గొనవచ్చు. భర్త పైన పడుకుని చేసే భంగిమలో కాకుండా ఇతర భంగిమల్లో అందులో పాల్గొనవచ్చు. ఇక ఫింగరింగ్ చేసుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. అయితే కొందరికి మాత్రం డాక్టర్లు ప్రెగ్నెన్సీ సమయంలో దాని జోలికి వెళ్లవద్దని డాక్టర్లు సూచిస్తారు. అలాంటి వాళ్లు అందులో పాల్గొనకుండా ఫింగరింగ్ చేసుకోవడం ఉత్తమం.

సిగరెట్స్, మద్యపానం
అలాగే మీ ఆయన సిగరెట్స్ తాగుతుంటే వెంటనే మానేయమని అతనికి సలహా ఇవ్వండి. మీ పక్కన ఆయన ధూమపానం చేస్తే మీపై, మీ బిడ్డపై ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అలాగే కొందరు అమ్మాయిలకు స్మోకింగ్ చేయడం, తాగడం వంటి అలవాట్లు ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో వాటికి దూరంగా ఉంటే మంచిది.

ఆరోగ్యంపై ప్రభావం
లేదంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై వాటి ప్రభావం ఉంటుంది. ఇలాంటి ఇంకా చాలా విషయాలపై గర్భిణీలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మరికొన్ని సూచనలు మరో ఆర్టికల్ ఇస్తాం. మా బోల్డ్ స్కై తెలుగును చదవండి. మీకు నచ్చిన ఆర్టికల్స్ ను షేర్ చేయండి. ఇతరులకు రెఫర్ చేయండి.



Click it and Unblock the Notifications
