For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ప్రెగ్నెన్సీ గురించి ఎవరికీ తెలియని నిజాలు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

  |

  ప్రెగ్నెన్సీ అనేది మహిళ జీవితంలోని ముఖ్యమైన ఘట్టం. ఈ దశలో గర్భిణీ ఎంతో ఆనందాన్ని పొందుతుంది. మరొక ప్రాణికి జన్మనిచ్చే వరం పొందిన స్త్రీని ఈ దశలో కుటుంబీకులు సైతం అల్లారుముద్దుగా చూసుకుంటారు. కాలు కిందపెట్టనివ్వరు. ఈ దశ కోసం స్త్రీ ఎంతగానో తపిస్తుంది.

  గర్భం దాల్చే వయసులో ఉన్న స్త్రీ తెలిసినవాళ్లలో ఎవరైనా గర్భిణీలు కనిపిస్తే తాను కూడా గర్భం దాల్చితే కలిగే ఆనందాన్ని ఊహించుకుని మురిసిపోతుంది. ఒకానొక శుభముహూర్తాన ప్రెగ్నన్సీ కిట్ లోని లైన్స్ మూడు కనిపిస్తే గర్భం దాల్చిన విషయాన్ని తెలుసుకుని పొంగిపోతుంది. మీరు గర్భం దాల్చారన్న సంగతిని బంధుమిత్రులకు తెలుపగానే మీకు సలహాలు వెల్లువలా అందటం ప్రారంభమవుతాయి.

  things no one told you about pregnancy

  అనేక రకాల అభిప్రాయాలు ఆహారం విషయంలో మీ వద్దకు చేరుతూ ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని మరింత కన్ఫ్యూజ్ చేస్తాయి. దాంతో మీరు ఈ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి బుక్స్ ను రిఫర్ చేయడం ప్రారంభిస్తారు. మ్యాగజైన్ లలో అలాగే నెట్ లో ప్రెగ్నెన్సీకి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి శోధిస్తారు.

  ఈ విషయంపై అందుబాటులో ఉన్న విస్తృత సమాచారం మొత్తం మీకు తెలిసినట్టుగానే అనిపిస్తుంది. నెలలు నిండుతున్న కొద్దీ ప్రెగ్నెన్సీ గురించి మీకు మరిన్ని సందేహాలు వెల్లువెత్తుతాయి. మీరు ఇప్పటి వరకు రిఫర్ చేసిన సోర్సెస్ లో వాటి గురించి ప్రస్తావించబడి లేదన్న సంగతి మీకు అర్థమవుతుంది. గర్భిణీగా మీరు ఎక్స్పీరియెన్స్ చేస్తున్న కొన్ని సమస్యల గురించి ఇప్పటి వరకు మీరు తెలుసుకోలేదు.

  నిజానికి, ఎవరూ ఈ విషయాలను మీ వద్ద ప్రస్తావించలేదు. అలాగే మ్యాగజైన్ లో కూడా వీటి గురించి వివరం లేదు. అటువంటి మీ సందేహాలను ఈ ఆర్టికల్ నివృత్తి చేయడానికి తోడ్పడుతుంది. ప్రెగ్నన్సీ సమయంలో ఇప్పటి వరకు ఎవరూ మీకు చెప్పని విషయాలను మీకోసం ఇక్కడ పొందుబరిచాము.

  1. డెలివరీ రూమ్ లో మీరు మలాన్ని విసర్జించే అవకాశం ఉంది:

  1. డెలివరీ రూమ్ లో మీరు మలాన్ని విసర్జించే అవకాశం ఉంది:

  సహజ కాన్పుకై ప్రసవ సమయంలో మీరు బిడ్డను బయటికి పంపేందుకు పుష్ ని ఇవ్వవలసి ఉంటుంది. ఈ విషయం మీకీపాటికే తెలిసి ఉంటుంది. అయితే, ఈ పుష్ అనేది మలాన్ని విసర్జించేటప్పుడు ఇచ్చే పుష్ తో పోలి ఉంటుంది. కాబట్టి, ఒక్కోసారి మీరు పుష్ ఇచ్చేటప్పుడు మలాన్ని విసర్జించటం జరగవచ్చు. అయితే, ఈ విషయాన్ని మీరు గుర్తించే సమయం మీకు ఉండదు. బేబీకి బర్త్ ఇవ్వాలన్న అతృతతో మీ ప్రయత్నంలో మీరుంటారు. నర్స్ లు వారి పని వారు చేస్తారు. దాంతో, మీరు డెలివరీ రూమ్ లో మలవిసర్జన చేసిన సంగతి మీకు తెలియదు. అందమైన పాపాయిని మీ చేతుల్లో పెట్టగానే మీ పురిటి నొప్పుల బాధ కూడా తగ్గిపోతుంది.

  2. వ్యాక్యూమ్ ప్రాసెస్ లో బేబీని తీసే అవకాశం ఉంది:

  2. వ్యాక్యూమ్ ప్రాసెస్ లో బేబీని తీసే అవకాశం ఉంది:

  ఇంట్లో గోడలపై అలాగే అందుబాటులో లేని కొన్ని ప్రాంతాలపై దుమ్ముని వ్యాక్యూమ్ తో ఏ విధంగా తొలగిస్తామో అదే విధంగా వ్యాక్యూమ్ ప్రాసెస్ తో బేబీను బయటకి తీసే విధానాన్ని డాక్టర్లు పాటించవచ్చు. మీరు పుష్ చేసి చేసి అలసిపోయినట్లు భావించినా లేదా ప్రెగ్నెన్సీ అనేది కాంప్లికేటెడ్ గా ఉన్నా వైద్యులు ఈ టెక్నీక్ ను పాటించే అవకాశాలున్నాయి. మీరు థైరాయిడ్, హై బ్లడ్ ప్రెషర్ లేదా డయాబెటిస్ వంటి సమస్యలతో సతమతమవుతున్నా మెడికల్ కండిషన్స్ రీత్యా ఈ టెక్నీక్ ను పాటించేందుకు వైద్యులు మొగ్గుచూపవచ్చు. అయితే, ఇటువంటి సంఘటనలు ఎదురైనా కూడా ఆరోగ్యకరమైన బిడ్డకే తల్లి జన్మనిచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి, మీరు దిగులు చెందవద్దు.

  3. ఉమ్మనీరు బ్రేక్ అవవచ్చు:

  3. ఉమ్మనీరు బ్రేక్ అవవచ్చు:

  టీవీలో డ్రామాలలో ఉమ్మ నీరు కేవలం ఒకేసారి బ్రేక్ అవుతుందన్న విషయాన్ని అనేక సార్లు చూపిస్తూ ఉంటారు. అయితే, ఇది వాస్తవానికి వ్యతిరేకం. గర్భస్థ శిశువుకు రక్షణగా ఉండే ఉమ్మనీరు ప్రసవానికి ముందు మీ శరీరం నుండి బయటకు రావడం జరుగుతుంది. దీనినే వాటర్ బ్రేకింగ్ అంటారు. ఇది రోజంతా జరగవచ్చు. రోజంతా అసౌకర్యంగా ఉండకూడదనుకుంటే మీరు ప్యాడ్స్ ను వాడి ఈ పరిస్థితిని మేనేజ్ చేయవచ్చు.

  4. ప్రసవానంతరం అనేక ప్యాడ్స్ ఉపయోగపడతాయి:

  4. ప్రసవానంతరం అనేక ప్యాడ్స్ ఉపయోగపడతాయి:

  గర్భిణీగా ఉండే సమయంలో బ్లీడింగ్ జరగదన్న సంగతి టీనేజ్ డేస్ నుంచి మీకు అవగాహనకు ఉండే విషయమే. అయితే, ప్రసవానంతరం ఇన్ని నెలలకు సరిపడా బ్లీడింగ్ అనేది జరగడం ప్రారంభము అవుతుంది. ప్రసవం తరువాత కనీసం పదిహేను రోజుల వరకు బ్లీడింగ్ జరగవచ్చు. పీరియడ్స్ తో అనుసంధానమై ఉండే క్రామ్ప్స్ అలాగే మిగతా అసౌకర్యాలు ఈ సమయంలో మిమ్మల్ని పలకరిస్తాయి. కాబట్టి, బోల్డన్ని ప్యాడ్స్ వాడకం పెరుగుతుంది.

  5. ప్రసవ వేదన:

  5. ప్రసవ వేదన:

  ప్రసవ వేదన గురించి మీరు వినే ఉంటారు. గర్భం దాల్చిన సంగతి తెలిసిన దగ్గర నుంచి ప్రసవ వేదన గురించి ఆలోచన ప్రారంభం అవుతుంది. ఈ వేదన అనేది పొట్టకి మాత్రమే పరిమితం కాదు. నడుం నొప్పి కూడా ఎదురవుతుంది. అలాగే పొత్తికడుపులో కూడా నొప్పిగా ఉంటుంది. కాసేపటికి భరించలేని నొప్పిగా మారుతుంది. ఈ వేదనని తప్పించుకోవాలని మీరు భావిస్తే మీరు ఎపిడ్యూరల్ గురించి మీ వైద్యునితో మాట్లాడాలి.

  6. స్క్వర్ట్ బాటిల్:

  6. స్క్వర్ట్ బాటిల్:

  పెరీనియం ఇరిగేషన్ (లేదా స్క్వర్ట్ బాటిల్) అనేది వాష్ రూమ్ కి వెళ్ళవలసి వచ్చిన సందర్భంలో వాడతారు. ప్రసవమైన కొన్ని రోజుల వరకు వీటిని వాడతారు. ఈ బాటిల్స్ ను వాడటం వలన మీకు ప్రసవం వలన కలిగిన స్ట్రెయిన్ నుంచి రిలీఫ్ అందుతుంది. వార్మ్ వాటర్ వలన మీకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రాసెస్ తోడ్పడుతుంది. ఈ ప్రికాషనరీ మెజర్స్ అన్నీడెలివరీ తరువాత మీ స్టిచెస్ ని ఏ మాత్రం ఇరిటేట్ చేయకుండా ఉండేందుకు తోడ్పడతాయి. తద్వారా, మీకు మరింత అసౌకర్యం కలగకుండా తోడ్పడతాయి.

  7. హెయిర్ ఫాల్:

  7. హెయిర్ ఫాల్:

  ప్రెగ్నెన్సీ సమయంలో మీ శిరోజాలు అందంగా నిగనిగలాడుతూ మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తి ఉండుంటాయి. మీ ముఖంలో కూడా ప్రెగ్నెన్సీ వలన కళ పెరిగి ఉంటుంది. అయితే, ఇవన్నీ మార్పులకు గురవుతాయన్న విషయాన్ని మీరు గుర్తించాలి. ప్రెగ్నెన్సీ సమయంలో మీ అందం మరింత రెట్టింపు కావడానికి మీ శరీరంలోని ఈస్ట్రోజన్ స్థాయిలు పెరగడమని మీరు గమనించాలి. డెలివరీ తరువాత వీటి స్థాయిలు అమాంతం తగ్గిపోతాయి. దాంతో ఆకస్మిక హెయిర్ ఫాల్ తో పాటు కొన్ని చర్మ సమస్యలను మీరు గుర్తించవచ్చు. ఈ సమస్యలు కొన్ని నెలలపాటు అలాగే ఉండవచ్చు.

  8. రాత్రిపూట విపరీతంగా చెమట పట్టడం:

  8. రాత్రిపూట విపరీతంగా చెమట పట్టడం:

  ఈ లక్షణం మరికొన్ని వారాల పాటు కొనసాగుతుంది. దీని విషయంలో దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇది సీరియస్ సమస్య కాదు. అయితే, విపరీతంగా చెమటపట్టడం వలన మీరు తరచూ నిద్ర మధ్యలో మేల్కొనవలసి వస్తుంది. ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నారేమోనన్న సందేహం కూడా మిమ్మల్ని వెంటాడుతుంది. అయితే, ప్రసవానంతరం కలిగే అనేక మార్పులలో ఇది కూడా ఒకటి. ఈ విషయం గురించి ఆందోళన చెందనవసరం లేదు. ఏసీని వాడటం ద్వారా అలాగే బెడ్ షీట్స్ ని మధ్య మధ్యలో రాత్రిపూట మార్చడం ద్వారా కొంత రిలీఫ్ అందుతుంది.

  9. మమ్మీ డైపర్:

  9. మమ్మీ డైపర్:

  బిడ్డకు జన్మనిచ్చిన తరువాత రక్తస్రావం అనేది కొన్ని రోజుల పాటు జరుగుతుంది. ఈ సమస్యను మేనేజ్ చేయడానికి ప్యాడ్స్ ను వాడటం జరుగుతుంది. అయితే, రెగ్యులర్ ప్యాడ్స్ కంటే కూడా మమ్మీ డైపర్స్ ద్వారా సౌకర్యం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ, ప్రసవానంతరం కలిగే బ్లడ్ ఫ్లో ను తట్టుకోవడానికి తయారుచేయబడిన డైపర్స్. ప్యాడ్స్ లాగానే ఇవి కూడా పనిచేసినా వీటి వలన కలిగే సౌకర్యం మెండు. ప్యాడ్స్ వలన డ్రెస్ పై కూడా మరకలు పడే అవకాశం ఉంది. అందువలన, ఈ సమయంలో బ్లడ్ ఫ్లో ను మేనేజ్ చేసేందుకు మమ్మీ డైపర్స్ అమితంగా తోడ్పడతాయి. తల్లి సౌకర్యంగా ఉంటేనే బిడ్డను చేసుకోగలదు. అందువలన, తల్లి ముందు తనగురించి ఆలోచించుకోవాలి. అప్పుడే బిడ్డను మరింత జాగ్రత్తగా చేసుకోగలుగుతుంది.

  10. పాదాల వాపు:

  10. పాదాల వాపు:

  ప్రెగ్నెన్సీలో పాదాల వాపు సమస్య వేధిస్తుంది. మూడవ ట్రైమిస్టర్ కి చేరుకోగానే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. ప్రసవానంతరం ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. అయితే, ప్రసవం తరువాత కూడా పాదాల వాపు తగ్గిపోయి పాదాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలి. ప్రసవం తరువాత రెండు వారాల వరకూ ఈ వాపు అనేది ఇబ్బంది పెడుతుంది. అయితే, కొంతమందికి పాదాల వాపు అలాగే శాశ్వతంగా ఉండిపోతుంది. దాంతో, షూ సైజ్ పెరుగుతుంది.

  Read more about: prenatal pregnancy
  English summary

  What No One Told You About Pregnancy

  There are a lot of suggestions that porespour in during your pregnancy. You are advised to have the right kind of food, have regular exercise, etc. But what no one tells about pregnancy is that the water breakout might happen more than once. The delivery pain is not only to the tummy but it quickly expands itself to the lower back and lower abdomen, sometimes becoming unbearable.
  Story first published: Tuesday, June 5, 2018, 14:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more