For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో ఖచ్ఛితంగా ఈ పనులకు దూరంగా ఉండండి

గర్భధారణ సమయంలో ఖచ్ఛితంగా ఈ కార్యకలాపాలకు దూరంగా ఉండండి.కడుపులో పెరుగుతున్న శిశువు సురక్షితంగా ఉండాలంటే మీరు తప్పకుండా కొన్ని రోజువారి కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. మరి ఎలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండా

|

శుభవార్త వినబోతున్నారా? మీ ఇంట్లో ఆనందాలు వెల్లివిరవబోతున్నాయా? ఒక కొత్త వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారా?ఇంకేముందు ఇక మీ ఇంట్లో మీతో పాటు, మీ కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోతారు. ఇప్పటి నుండి ప్రతి క్షణం చాలా ఉత్తేజంగా మరియు అందంగా గడుపుతారు. అలా గడపాలంటే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. స్త్రీ గర్భవతి అయిన తర్వాత మీ రోజువారి కార్యకలాపాల్లో తప్పనిసరిగా మార్పులు కలిగి ఉండవచ్చు. మీకు లేదా కడుపులో పెరిగే మీ శిశువుకు హాని కలిగించే ఎలాంటి కార్యకలాపాలకు మీరు దూరంగా ఉండాలని తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి.

సాధారణంగా మహిళ గర్భం పొందిన తర్వాత శరీరంలో అనేక మార్పులు కారణంగా కాస్త అలసటా ఉండటం సహజం అయితే అలా ఉండకుండా యాక్టివ్ గా ఉండాలని ఇంట్లో పెద్దలతో పాటు డాక్టర్లు కూడా సూచిస్తుంటారు. గర్భాధారణ సమయంలో యాక్టివ్ గా ఉండటం మంచిదే. గర్భధారణ సమయంలో మితంగా వ్యాయామం చేసే మహిళలకు ప్రసవంలో ఎలాంటి శ్రమ ఉండదని, ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించవచ్చని నిరూపించబడింది . ముఖ్యంగా రోజువారి వ్యాయామం వల్ల గర్భిణీ ప్రసవం సులభం అవుతుంది. అంతే కాదు ఇది మీకు మరియు మీ బిడ్డకు కూడా మంచిది.

 8 Activities to Avoid During Pregnancy

అయితే కడుపులో పెరుగుతున్న శిశువు సురక్షితంగా ఉండాలంటే మీరు తప్పకుండా కొన్ని రోజువారి కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. మరి ఎలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలో చూద్దాం.

వెయిట్ ట్రైనింగ్ :

వెయిట్ ట్రైనింగ్ :

వ్యాయామంలో బరువుకు సంబంధించిన శిక్షణ నివారించండి. ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల పొట్టకు గాయం కలిగిస్తుంది మరియు గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువ. గర్భస్రావాల చరిత్ర ఉన్న ఎవరైనా లేదా ఇతరులు కూడా ఈ సమయంలో ఎక్కువ బరువులు ఎత్తడం మానేయాలి.

స్ట్రెచ్చింగ్ వ్యాయామాలకు దూరంగా ఉండండి:

స్ట్రెచ్చింగ్ వ్యాయామాలకు దూరంగా ఉండండి:

యోగా ఆరోగ్యానికి మంచిదన్న విషయం మనందరికి తెలిసిన విషయమే. అయితే గర్భిణీ స్త్రీలకు సురక్షితం కాదు. స్ట్రెచింగ్ భంగిమలు వల్ల పొట్ట ఉదరంపై ఎక్కువ భారం పడుతుంది, దాంతో పిండం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా గర్భిణీల కోసం ప్రత్యేకమై ప్రీనేటల్ యోగ క్లాసులకు వెళ్లవచ్చు.

బోర్లా పడుకోకూడదు:

బోర్లా పడుకోకూడదు:

కడుపులో శిశువుకు హాని కలిగించే విధంగా కడుపుపై పడుకునే వ్యాయామాలకు దూరంగా ఉండండి. ఇది గర్భధారణ సమయంలో ఇది చాలా అసౌకర్యమైన భంగిమ. దీన్ని తప్పకుండా నివారించండి.

వేడి నీటి స్నానం:

వేడి నీటి స్నానం:

వేడి నీటితో స్నానం చేయకూడదనడం కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఎక్కువ సేపు వేడినీటి స్నానపు తొట్టెలో ఉండటం వల్ల అతి మీ కడుపులో పెరిగే బిడ్డకు ప్రమాదకరం మరియు శిశువు న్యూరల్ ట్యూబ్ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఈ కారణంచేతన గర్భధారణ సమయంలో వేడి నీటి స్నానాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే బాత్ టబ్ , వాటర్ శుభ్రంగా లేకపోతే తల్లి మరియు బిడ్డలకు ఇన్ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉంది.

రోలర్ కోస్టర్ రైడ్స్:

రోలర్ కోస్టర్ రైడ్స్:

రోలర్ కోస్టర్ సవారీలు. అమ్యూస్మెంట్ పార్క్ లో ఎలాంటి సవారీలు చేయకూడదు. సవ్య మరియు అపసవ్య దిశలో తిరగడం వల్ల వికారం కలిగిస్తుంది. అలాగే ఒత్తిడితో టేకాఫ్ చేయడం రైడ్ చేయడం వల్ల శిశువుకు హాని కలిగిస్తుంది. ఇది గర్భాశయ గోడనుండి మావి వేరుచేయడానికి దారితీస్తుంది.

పరుగు :

పరుగు :

గర్భాదారణ సమయంలో రన్నింగ్ మరియు జాగింగ్ ను మానుకోండి. అయితే గతంలో కూడా అంటే చాలా సంవత్సరాలుగా నడుస్తున్న మహిళలు గర్భాధారణ సమయంలో కూడా జాగింగ్ చేయవచ్చని పరిశోధలకు అంటున్నారు. అయితే మొదటి త్రైమాసికంలో జాగింగ్ మరియు రన్నింగ్ నివారించడం మంచిది, లేదంటే అలసట మరియు మైకం అనుభవిస్తారు. ఏదైనా అతిగా చేయడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువ.

సైక్లింగ్ :

సైక్లింగ్ :

ఒక్క సారిగా పొట్ట పెరగడం ప్రారంభమైతే సైకిల్ తొక్కడం చాలా కష్టమవుతుంది. పొట్ట పెరగడం వల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. మరియు ఈ సమయంలో సైకిల్ తొక్కడం వల్ల శరీరం బ్యాలెన్స్ తప్పడం వల్ల పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, సైకిల్ తొక్కకపోవడం మంచిది.

హై ఇంపాక్ట్ ఏరోబిక్స్:

హై ఇంపాక్ట్ ఏరోబిక్స్:

గతంలో మీకు గర్భస్రావం జరిగి ఉంటే, హై ఇంపాక్ట్ ఏరోబిక్స్ అయినా జంపింగ్, దూకడం, మరియు స్కిప్పింగ్ వంటివి ఖచ్ఛితంగా నివారించాలి. ఇంకా దీని వల్ల శరీరం బ్యాలెన్స్ తప్పడం వల్ల తల్లి మరియు బిడ్డకు ప్రమాదం. కాబట్టి, వీటికి దూరంగా ఉండండి.

English summary

8 Activities to Avoid During Pregnancy

When pregnant, consider the changes your body is going through before indulging in any activity. Here is a list of activities to avoid during pregnancy.
Desktop Bottom Promotion