For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!

గాల్లో కాలుష్యం పెరిగితే అబార్షన్లు అమాంతం పెరిగిపోతాయంట.

|

ప్రెగ్నెన్సీ అనేది మహిళ జీవితంలోని ముఖ్యమైన ఘట్టం. ఈ దశలో గర్భిణీ ఎంతో ఆనందాన్ని పొందుతుంది. మరొక ప్రాణికి జన్మనిచ్చే వరం పొందిన స్త్రీని ఈ దశలో కుటుంబీకులు సైతం అల్లారుముద్దుగా చూసుకుంటారు.

Study : Air pollution behind increased risk of pregnancy loss in India, South Asia

కాలు కిందపెట్టనివ్వరు. ఈ దశ కోసం స్త్రీ ఎంతగానో తపిస్తుంది. అయితే కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే చనిపోతే ఎంతో బాధపడుతుంది. అయితే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయనే దానిపై పరిశోధనలు జరిపారు చైనా శాస్త్రవేత్తలు.

Study : Air pollution behind increased risk of pregnancy loss in India, South Asia

పెకింగ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు తాజాగా చేసిన అధ్యయనంలో మన దేశంలో ముఖ్యంగా దక్షిణ ఆసియాలో అబార్షన్లు ఎందుకు పెరుగుతున్నాయి.. వాటికి అసలై కారణాలేంటి విషయాలను తెలుసుకున్నారట. ఈ నేపథ్యంలో ఆ అధ్యయనంలో కొన్ని సంచలనమైన విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

గాలి కాలుష్యం వల్ల..

గాలి కాలుష్యం వల్ల..

భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్థాన్ తో పాటు దక్షిణ ఆసియాలో గర్భధారణ నష్టం గణనీయంగా పెరిగిందని పెకింగ్ యూనివర్సిటీ వారి అధ్యయనంలో తేలిందట. దీనంతటికీ కారణం గాలి కాలుష్యమేనని వారి అధ్యయనంలో వెల్లడైందట.

గాలి నాణ్యత ప్రమాణం..

గాలి నాణ్యత ప్రమాణం..

భారతదేశం యొక్క గాలి నాణ్యత ప్రమాణం 40 ug/m3ని మించిన PM 2.5 కణాలకు గురి కావడం వల్ల దక్షిణ ఆసియాలో సంవత్సరానికి 3,49,681 గర్భధారణ నష్టాల(అబార్షన్లు)కు దారి తీసిందని, ఇది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి ప్రాంతమని, ఇక్కడే ఇలాంటివి జరిగాయని ఈ అధ్యయనం కనుగొంది.

సుమారు 7 శాతం..

సుమారు 7 శాతం..

2000 సంవత్సరం నుండి 2016 సంవత్సరం వరకు వార్షిక గర్భధారణ(అబార్షన్) నష్టంలో ఇది ఏడు శాతంగా ఉన్నట్లు ఈ అద్యయనం ద్వారా వెల్లడైంది.

అబార్షన్ కు మరో కారణం..

అబార్షన్ కు మరో కారణం..

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిబంధనల ప్రకారం గాలి నాణ్యత మార్గదర్శకం 10 ug/m3 కంటే ఎక్కువగా ఉండే వాయు కాలుష్యం వల్ల దక్షిణ ఆసియా దేశాల్లో దాదాపు 29 శాతం అబార్షనకు కారణమైనట్లు ఆ అధ్యయనంలో వెల్లడైంది.

మన దేశంలో..

మన దేశంలో..

దక్షిణ ఆసియాలో పరిస్థితి ఇలా ఉంటే.. మన దేశంలో ఆశ్చర్యకరంగా అత్యంత ఎక్కువగా 77 శాతం మేరకు అబార్షన్లు వాయు కాలుష్యం వల్లే జరగడం విచారకరం.

తర్వాతి స్థానాల్లో..

తర్వాతి స్థానాల్లో..

మన దేశం తర్వాత పాకిస్థాన్ లో 12 శాతం, బంగ్లాదేశ్ లో 11 శాతం మేరకు అబార్షన్లు జరిగాయని తమ అధ్యయనంలో కనుగొన్నామని పెకింగ్ యూనివర్సిటీ నుండి అధ్యయన ప్రధాన రచయి టావో జు పేర్కొన్నట్లు PTI పేర్కొంది.

English summary

Study : Air pollution behind increased risk of pregnancy loss in India, South Asia

Here we talking about study : Air pollution behind increased risk of pregnancy loss in India, South Asia. Read on
Story first published:Wednesday, January 27, 2021, 17:05 [IST]
Desktop Bottom Promotion