For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

New parents: మీ ఇంట్లో బుజ్జాయి రాత్రుళ్లు నిద్రపోనివ్వడం లేదా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే

|

New parents: ఇంట్లో బుజ్జాయిలు ఉంటే ఆ సందడే వేరు. వారు చేసే అల్లరి చూడ ముచ్చటగా ఉంటుంది. వారి ముద్దు ముద్దు మాటలు ముచ్చటగొలుపుతాయి. వారితో కొద్ది సేపు గడిపితే చాలా సంతోషంగా, హాయిగా అనిపిస్తుంది. చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే ఆ ఇంటికి కళ వచ్చినట్టే. వారు ఒక్కరోజు లేకపోయినా ఇల్లంతా బోసిపోయినట్టు కనిపిస్తుంది. అయితే చాలా మంది పిల్లలు రాత్రుళ్లు నిద్రపోకుండా సతాయిస్తూ ఉంటారు. దీని వల్ల తల్లిదండ్రులకు కూడా నిద్ర ఉండదు. నిద్రలేమి చాలా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

Useful tips for new parents to help them cope with sleepless nights in Telugu

నవజాత శిశువులు రోజుకు 14-17 గంటలు నిద్రపోతున్నప్పటికీ, కొన్ నిసార్లు వారి నిద్ర-మేల్కొనే చక్రాలు వారి తల్లిదండ్రుల కంటే భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా తల్లులు వారి ప్రసవానంతర శరీరం నుండి కోలుకుంటున్నందున ఈ దశను క్రమంగా పాటించడం కొన్ని సార్లు కష్టంగా ఉంటుంది.

Useful tips for new parents to help them cope with sleepless nights in Telugu

బుజ్జాయిలు చాలా మంది పగటి వేళ నిద్ర పోతారు. ఇలాంటి పిల్లలు రాత్రుళ్లు నిద్రపోకుండా సతాయిస్తారు. పడుకోబెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అస్సలు నిద్రపోరు. మరి కొంత మంది పిల్లలు ఇలా పడుకోగానే అలా నిద్రలోకి జారుకుంటారు. పిల్లలు ఇలా నిద్ర పోకుండా మెలకువతో ఉండటానికి పలు కారణాలు ఉంటాయి.

బుజ్జాయిలు పడుకోకుండా ఇబ్బంది పెడుతున్న తల్లిదండ్రుల కోసం కొన్ని చిట్కాలు..

1. శిశువుతో నిద్రపోవడం

1. శిశువుతో నిద్రపోవడం

శిశువు నిద్రపోతున్న సమయంలో వారితో కలిసి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమైన మార్గం.ఇలా చేయడం మొదట్లో కొద్దిగా కష్టంగా అనిపించినా.. రోజులు గడుస్తున్న కొద్దీ దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నట్లు గుర్తిస్తారు. నిద్రలేమి అనే సమస్య తలెత్తదు. తక్కువ నిద్ర వల్ల వచ్చే అలసట, చికాకు వంటివి ఏవీ దరిచేరవు.చాలా మంది తల్లిదండ్రులు శిశువు నిద్రపోతున్నప్పుడు వేరే పనులను పూర్తి చేసేయాలన్న ఆత్రుతతో ఉంటారు. కానీ బిడ్డతో కలిసి నిద్రపోవడం వల్ల సరైన నిద్ర పొందవచ్చు.

2. శిశువులకు సురక్షితమైన నిద్ర పద్ధతులు

2. శిశువులకు సురక్షితమైన నిద్ర పద్ధతులు

శిశువు యొక్క భద్రత గురించిన ఆందోళన కొంత మంది తల్లిదండ్రులకు ఎక్కువగా ఉంటుంది. సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) ప్రకారం, శిశువులకు కొన్ని సురక్షితమైన నిద్ర పద్ధతులు ఉన్నాయి. దుప్పట్లు లేదా దిండ్లు పడక ప్రాంతానికి దూరంగా ఉంచడం అలాగే శిశువుకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకు గదిని వారితో కలిసి పంచుకోవాలని సూచించింది. అంటే శిశువులతో పాటు నిద్రించాలని సి.డి.సి చెప్పింది. అలాగే వారికి కంఫర్ట్ ఉన్న ప్రాంతంలో పడుకోబెట్టాలి.

3. మంచి ఆహారం తీసుకోవాలి

3. మంచి ఆహారం తీసుకోవాలి

బిడ్డ ఎదుగుదలకు, అలాగే వారి ఆరోగ్యానికి తల్లి పాలు ఎంతో ముఖ్యమైనవి. తల్లి పాల కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనం ఇచ్చే ఆహార పదార్థాలు లేవు. కాబట్టి బిడ్డకు తల్లి పాలు ఎంతో ముఖ్యం. అలాగే ఈ పాలు రావడానికి తల్లి కూడా మంచి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. దీని వల్ల బిడ్డకు మంచి పాలు రావడంతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రసవానంతరం తల్లులకు ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎక్కువ ఆహారం తినడం కంటే కూడా ఎక్కువ శక్తిని, పొట్ట నిండిన భావన కలిగించే ఆహారాన్ని తీసుకుంటే అన్ని రకాలుగా మంచిది.ఎందుకంటే ఇది శిశువుల పెరుగుదల మరియు అభివృద్ధిని నేరుగా ప్రభావితం చేస్తుంది. జీవితంలోని తరువాతి దశలలో వారి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

4. ఇతరుల నుండి సలహాలు, సాయం తీసుకోండి

4. ఇతరుల నుండి సలహాలు, సాయం తీసుకోండి

మహిళలు గర్భంతో ఉన్న సమయంలో వారి శరీరంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి.ప్రసవం తర్వాత కూడా తల్లి శరీరం కొంత మార్పు జరుగుతుంది.తల నొప్పి, అలసట, బలహీనతల వల్ల పిల్లలను ఒంటరిగా చూసుకోవడం చాలా కష్టమైన పని. అందువల్ల భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల నుండి సాయం తీసుకోవాలి. పిల్లలను ఎత్తుకోవడం, వారికి వేరే పనులు చేయడంలో సాయం అడగాలి. బిడ్డ తల్లి పాలు తాగిన తర్వాత కాసేపు ఎత్తుకోమనాలి. కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు బిడ్డను ఆడించమని చెప్పాలి.

5. విరామం తీసుకోండి

5. విరామం తీసుకోండి

రోజు వారీ దిన చర్య నుండి చిన్న విరామంతో శిశువుపై పెద్ద ప్రభావం ఉండదు. 10 నుండి 15 నిమిషాల సాధారణ ప్రాణాయామం చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మీకు కొంత విశ్రాంతిని ఇస్తుంది. ప్రతికూల భావోద్వేగాలను తగ్గిస్తుంది. ఆలాగే ఒత్తిడిని నియంత్రించడంలో సహాయం చేస్తుంది. సంగీతం వినడం లేదా పుస్తకం చదవడం వంటి మీకు ఇష్టమైన అభిరుచిలో మునిగిపోవడానికి కూడా మీరు సమయాన్ని ఉపయోగించవచ్చు.

ముగింపు

వీలైనంత ఎక్కువ సేపు నిద్ర పోయేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడానికి అదే ఉత్తమమైన మార్గం. తల్లులు ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డలను ఆరోగ్యంగా చూసుకోవచ్చు. ముఖ్యంగా, ప్రసవానంతర డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

English summary

Useful tips for new parents to help them cope with sleepless nights in Telugu

read on to know Useful tips for new parents to help them cope with sleepless nights in Telugu
Story first published:Friday, July 15, 2022, 16:11 [IST]
Desktop Bottom Promotion