Latest Updates
-
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.!
What is Surrogacy: సరోగసి అంటే ఏంటి? సెలబ్రిటీలు సరోగసికి ఎందుకు ఆకర్షితులవుతున్నారు?
అద్దె గర్భం ద్వారా పిల్లలు కనే పద్ధతిని సరోగసి అంటారు. వేరే దంపతులకు చెందిన బిడ్డను మరొక మహిళ మోస్తుంది. సరోగసి పద్ధతిలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళకు ఆ బిడ్డపై ఎలాంటి హక్కులూ ఉండవు.
What is Surrogacy: ఈ మధ్యకాలంలో సరోగసి అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. సరోగసినే తెలుగులో అద్దె గర్భం అంటున్నారు. సెలబ్రిటీలు ఎక్కువగా అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కంటున్నారు. ముఖ్యంగా ఈ ధోరణి బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఎక్కువగా కనిపిస్తోంది. తొమ్మిది నెలలు బిడ్డను మోయడం, గర్భం ధరించడం వల్ల శరీరాకృతి దెబ్బతినడం, ప్రసవం ద్వారా పొట్టపై వచ్చే మార్కులు ఇలాంటి బ్యూటీ కారణాల వల్ల చాలా మంది సెలబ్రిటీలు సరోగసి పద్ధతి ద్వారా బిడ్డల్ని కంటున్నారు.

సరోగసి అంటే ఏంటి?
అద్దె గర్భం ద్వారా పిల్లలు కనే పద్ధతిని సరోగసి అంటారు. వేరే దంపతులకు చెందిన బిడ్డను మరొక మహిళ మోస్తుంది. భర్త నుండి వీర్యం, భార్య నుండి అండాన్ని తీసి ల్యాబ్ లో ఫలదీకరణం చేయించి ఆ పిండాన్ని మరో మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. 9 నెలలు ఆ పిండం అద్దె గర్భంలోనే పెరిగి ప్రసవం అయ్యాక దంపతులకు అప్పగించాల్సి ఉంటుంది. సరోగసి పద్ధతిలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళకు ఆ బిడ్డపై ఎలాంటి హక్కులూ ఉండవు. అండం, వీర్యం ఇచ్చిన వారే ఆ బిడ్డకు చట్టప్రకారం తల్లిదండ్రులు అవుతారు.

సరోగసి పద్ధతి ఎందుకు?
సెలబ్రిటీలు, సినిమా రంగానికి చెందిన వారు ఎక్కువగా సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కంటున్నారు. 9 నెలలు గర్భం మోయడం చాలా కష్టంగా భావించడం. అలాగే గర్భం ధరించడం వల్ల శరీరాకృతి కోల్పోతామన్న భయం, ప్రసవం వల్ల పొట్టపై మార్కులు పడితే అందం పోతుందని, తిరిగి మంచి శరీరాకృతి కోసం చాలా కష్టపడాల్సి ఉంటుందన్న కారణాల వల్ల చాలా మంది సరోగసి పద్ధతి వైపు వెళ్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
వీటితో వైద్యపరమైన సమస్యలూ కారణం అవుతున్నాయి. చాలా మంది సెలబ్రిటీలు 35 ఏళ్లు దాటిన తర్వాత వివాహం చేసుకుంటున్నారు. ఆ వయస్సులో గర్భం దాల్చడం కొందరిలో కష్టంగా మారుతోంది. పీసీఓడీ కారణాలు, గర్భాశయ ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్య కారణాల వల్ల గర్భం ధరించడం అసాధ్యం కావొచ్చు. అలాంటి పరిస్థితుల్లో సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కంటున్నారు.

బిడ్డను మోసే మహిళను ఎలా ఎంచుకోవాలి ?
బిడ్డను మోసే అమ్మని ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే, ఆమె చాలా ఆరోగ్యవంతంగా ఉండాలి. వీటికి తోడు మరెన్నో విషయాలను కూడా ఆమె గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బిడ్డను మోసే తల్లిని ఎంచుకొనే విషయంలో కొన్ని విషయాలను ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యపరమైన పరీక్షలన్నీ చేయించాల్సి ఉంటుంది. గుండె సంబంధిత పరీక్షలు, చక్కెర స్థాయిలు, వంశపారంపర్యంగా ఏవైనా వ్యాధులు మొదలగునవి ఉన్నాయా అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మానసికపరంగా ఏవైనా అనారోగ్యసమస్యలు ఉన్నాయా అనే విషయం కూడా తెలుసుకోవాలి.

సరోగసి నిబంధనలు ఏంటి?
* సరోగసి - 2021 చట్టం ప్రకారం బిడ్డ కావాలనుకునే జంటకు కచ్చితంగా వివాహం జరిగి ఉండాలి. మహిళ వయస్సు 23 నుండి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి. అలాగే పురుషుని వయస్సు 26 నుండి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
* సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కావాలనుకునే వారికి పిల్లలు ఉండకూడదు. దత్తత తీసుకున్న పిల్లలూ ఉండకూడదు. అలాగే గతంలో సరోగసి పద్ధతి ద్వారా కలిగిన పిల్లలూ ఉండకూడదు.
* పిల్లలు ఉండి వారు మానసికమైన, శారీరకమైన దీర్ఘకాలిక వ్యాధులతో ఉంటే.. ప్రాణాంతక వ్యాధులు ఉన్నా.. సరోగసి ద్వారా పిల్లలను కనవచ్చు.
* అలాగే సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కావాలనుకునే వారికి ముందు ఆ అవసరం ఉందో లేదో వైద్య అధికారులు ధ్రువీకరించాలి. అప్పుడే సరోగసికి చట్టం అనుమతి ఇస్తుంది.
* పెళ్లి కాకుండా కలిసి ఉండే వారి గురించి చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదు.
* ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు, ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందిన వారు సరోగసి ద్వారా బిడ్డను కనే అనుమతి ఉండదు.

ఇప్పటి వరకు సరోగసి ద్వారా ఏ సెలబ్రిటీలు పిల్లల్ని కన్నారంటే.
.* సరోగసి ద్వారా ఆమిర్ ఖాన్ దంపతులు 2011 లో బిడ్డను కన్నారు.
* 2013వ సంవత్సరంలో షారూక్ ఖాన్ దంపతులు సరోగసి ద్వారా పిల్లలను కన్నారు.
* 2014లో మంచు లక్ష్మీ దంపతులు బిడ్డను కన్నారు.
* 2017 లో కరణ్ జోహార్ సరోగసి ద్వారా పిల్లలను కన్నారు.
* 2022 లో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ సరోగసి పద్ధతి ద్వారానే తల్లిదండ్రులు అయ్యారు.



Click it and Unblock the Notifications
