Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
మైసూర్ బోండా గుండ్రంగా, లోపల స్పాంజిలా రావాలంటే ఇలా చేయాల్సిందే!
దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన బ్రేక్ ఫాస్ట్ లలో మైసూర్ బోండా ఒకటి. పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా స్పాంజిలా ఉండే ఈ బోండాలను ఇష్టపడని వారుండరు. అయితే అదే రుచితో, అదే పర్ఫెక్షన్ తో హోటల్ స్టైల్ మైసూర్ బోండాను ఇంట్లోనే చేస్తుంటే రావట్లేదని చాలామంది కంప్లెయింట్ చేస్తుంటారు. ఆకృతి కరెక్ట్ గా రావట్లేదని, లోపల పిండి ఉడకటం లేదని ఇలా చెబుతుంటారు. అయితే హోటల్ స్టైల్ లో, అంతకు మించిన రుచితో మైసూర్ బోండా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మైసూర్ బోండా తయారీకి కావలసిన పదార్థాలు
-మైదా పిండి
-పుల్లటి పెరుగు
-వంట సోడా (బేకింగ్ సోడా)
-జీలకర్ర
-పచ్చిమిర్చి
-అల్లం
-కరివేపాకు
-ఉప్పు
-ఆయిల్
మైసూర్ బోండా తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 1 కప్పు పుల్లటి పెరుగు వేయండి. ఈ పెరుగుతున్న 5 నిమిషాల పాటు బాగా బీట్(గిలక్కొట్టడం)చేయాలి. దీంతో పెరుగు మంచి సాఫ్ట్ గా, క్రీమీ టెక్చర్ వస్తుంది.
-తర్వాత పెరుగులో రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి.
-తర్వాత పెరుగు మిశ్రమంలో 1 కప్పు మైదా పిండి వేసి, 1 కప్పు వేడి నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని పెరుగు మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకున్నాక మిశ్రమం చేత్లో లాగుతుంటే సాగుతున్నట్లు రావాలి. 5 నిమిషాల పాటు ఈ పిండి మొత్తాన్ని చేత్తోనే కిందకి కొడుతూ పైకి తీస్తున్నట్లుగా బీట్ చేయాలి.
-బీట్ చేస్తూ పిండిని కలుపుకున్న తర్వాత అందులో 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు, అర టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసుకోండి. అన్నీ కలిసేట్లు బాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు కలుపుకున్నాక ఈ పిండి మీద ప్లేట్ లేదా ఒక క్లాత్ ని పెట్టి కనీసం 1 గంట సేపు అలా వదిలేయాలి. పిండి ఎంత ఎక్కువ సేపు నానితే మైసూర్ బోండా అంత చక్కగా వస్తుంది.
-1 గంటసేపు తర్వాత చూస్తే పిండి ఫ్లఫీగా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని అస్సలు కదిలించకూడదు.
-స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేశాక మంటను సిమ్ లో ఉంచండి. పిండిని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ బాండీలో ఆయిల్ లోకి వదలాలి.తర్వాత మంటను మీడియంలోకి మార్చి బోండాలను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకొని ఆయిల్ లో నుంచి బయటకు తీసేయాలి. అంతే పర్ఫెక్ట్ మైసూర్ బోండా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
