Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే అటుకుల పొంగల్..తయారీ ఎంతో సులభం!
సాధారణంగా పొంగల్ అనగానే మనకు బియ్యం, పెసరపప్పుతో చేసే వంటకం గుర్తొస్తుంది. అయితే బియ్యానికి ప్రత్యామ్నాయంగా, మరింత సులభంగా, వేగంగా,ఆరోగ్యకరంగా చేసుకోగలిగే వంటకమే అటుకుల పొంగల్.
దీనిని పోహా పొంగల్ అని కూడా అంటారు. నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది. అటుకుల పొంగల్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసరపప్పు
-నెయ్యి
-అటుకులు
-మిరియాలు
-పచ్చిమిర్చి
-జీలకర్ర
-ఆవాలు
-అల్లం
-జీడిపప్పు
-కరివేపాకు
-పసుపు
-కొత్తిమీర
-నీళ్లు
-ఉప్పు
తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అర కప్పు పెసర పప్పు వేసి నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన నీటిని వంపేయండి.
-ఇప్పుడు స్టవ్ మీద గిన్నె లేదా కుక్కర్ పెట్టి అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేశాక అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసి 2-3 నిమిషాలు వేయించుకోవాలి. దీంతో పప్పులో ఉండే పప్పు వాసన అంతా పోయి పొంగల్ రుచిగా ఉంటుంది.
-పెసరపప్పు లైట్ గా కలర్ మారిన తర్వాత అందులో 2 కప్పుల నీళ్లు పోయండి. ఇందులోనే పావు టీస్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కరివేపాకు, 12 మిరియాలు వేసి ఒకసారి బాగా కలిపి కుక్కర్ పై మూతపెట్టి 3-4 విజిల్స్ వచ్చేవరకు(పప్పు మెత్తగా ఉడికే వరకు)ఉడికించాలి.
- ఒక బౌల్ లో 1 కప్పు మందపాటి అటుకులను వేసి నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి
-కుక్కర్ లో పప్పు ఉడికిన తర్వాత పప్పు కొంచెం పలుకుగా ఉంటే కవ్వంతో కొంచెం మెదుపుకోండి.
-ఇప్పుడు కుక్కర్ లో ఉడికిన పప్పులో కడిగిన అటుకులు వేయండి. ఇందులోనే ఒకటిన్నర గ్లాసుల నీళ్లు(400 ml)నీళ్లు పోసి కలుపుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలిపి మీడియం మంట పప్పు అటుకుల మిశ్రమాన్ని 3-4 నిమిషాలు ఉడికించాలి.
-ఉడికేటప్పుడు పప్పుపై తేటలాగా నురగ వస్తుంది. దానిని గరిటతో తీసేయాలి. మిశ్రమం కాస్త దగ్గరపడుతున్నప్పుడే అందులోకి తాలింపు రెడీ చేసుకోవాలి.
-తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3-4 టీస్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక అందులో అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 టీస్పూన్ల పచ్చిమిరపకాయల ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసి లైట్ గా ఫ్రై చేశాక అందులో కచ్చాపచ్చగా దంచిన అర టీస్పూన్ మిరియాలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి.
-తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలుపుకున్నాక ఇందులో మరోపక్కన ఉడుకుతున్న అటుకులు పప్పు మిశ్రమాన్ని వేసి మొత్తం బాగా కలపండి. మరో 2-3 నిమిషాలు ఉడికిస్తే దగ్గరపడి కిచిడిలా అవుతుంది. మరీ ఎక్కువ దగ్గరపడే వరకు ఉడికించొద్దు.
-చివరగా అందులో పిడికెడు కొత్తిమీర తరుగు చల్లుకొని కలిపి స్టవ్ ఆపేయండి. అంతే హెల్దీ అటుకుల పొంగల్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications