Latest Updates
-
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.!
నూనె చుక్క లేకుండా.. రుచిలో అదుర్స్ అనిపించే చికెన్ రెసిపి..ఎలా చేసుకోవాలంటే
నాన్ వెజ్ అనే పదం వినగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది చికెన్. తందూరి, బిర్యానీ, కబాబ్, ఫ్రై..ఇలా ఏ రూపంలో ఉన్నా సరే, చికెన్‌ను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఆరోగ్యానికి కూడా చికెన్ తినడం వల్ల మేలు జరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. అయితే అమృతమైనా ఎక్కువ తీసుకుంటే విషంగా మారుతుంది కాబట్టి చికెన్ ఆరోగ్యానికి మంచిదే అయినా తక్కవగా తీసుకోవడం మంచిది. చికెన్ లో ఆయిల్ ఎంత ఉంటుందో, ఆరోగ్యం పాడవుతుందేమో అనే భయం చాలామందిని తమకు ఇష్టమైన ఈ వంటకానికి దూరం చేస్తుంది.
రుచికి, ఆరోగ్యానికి మధ్య నలిగిపోయే వారందరి కోసం ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. నూనె చుక్క కూడా వాడకుండా.. చికెన్ సహజమైన రుచిని ఆస్వాదిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకునే ఒక అద్భుతమైన పద్ధతి ఉంది. ఒక్కసారి తిన్నారంటే..అసలు నూనె లేకుండా ఇంత రుచిగా చికెన్ వండవచ్చా అని ఆశ్చర్యపోతారు. ఆయిల్ లేకుండా చికెన్ ఎలా వండాలో ఇక్కడ చూడండి.

ఆయిల్ ఫ్రీ చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-చికెన్ బ్రెస్ట్: 4 (ఎముకలు, చర్మం లేనివి)
-నిమ్మరసం: 2 కాయల నుండి తీసింది
-రోజ్మేరీ: 2 టేబుల్ స్పూన్లు
-వాము: 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినది)
-వెల్లుల్లి రెబ్బలు: 2 (సన్నగా తురిమినవి)
-ఉప్పు: మీ రుచికి సరిపడా
-నల్ల మిరియాల పొడి: అర టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో నిమ్మరసం, సన్నగా తరిగిన రోజ్మేరీ, వాము, వెల్లుల్లి తురుము, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో చికెన్ బ్రెస్ట్ ముక్కలను వేసి, మసాలా అంతా వాటికి బాగా పట్టేలా కలపాలి. దీనిపై మూతపెట్టి కనీసం 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఈ మ్యారినేషన్ ఎంత ఎక్కువ సేపు ఉంటే, చికెన్ అంత జూసీగా, రుచిగా తయారవుతుంది.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఒక నాన్ స్టిక్ గ్రిల్ పాన్ ను మీడియం నుండి అధిక మంటపై బాగా వేడి చేయండి. పాన్ నుండి కొద్దిగా ఆవిరి వస్తున్నప్పుడు అది సిద్ధంగా ఉన్నట్లు లెక్క.
-వేడెక్కిన పాన్ పై మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా పెట్టండి. ఒకవైపు 5 నుండి 7 నిమిషాల పాటు బంగారు రంగులోకి వచ్చే వరకు గ్రిల్ చేయండి. ఆ తర్వాత రెండో వైపుకు తిప్పి, మరో 5 నిమిషాలు ఉడికించండి. చికెన్ పూర్తిగా ఉడికి, మంచి రంగులోకి వచ్చాక స్టవ్ ఆపేయండి.
-చికెన్ ను వెంటనే ప్లేట్ లోకి మార్చకుండా ఒక రెండు నిమిషాలు పాన్ లోనే ఉంచండి. ఇలా చేయడం వల్ల రసాలన్నీ చికెన్ లోనే ఉండి, ముక్క మరింత మృదువుగా, జూసీగా ఉంటుంది. అంతే నోరూరించే, ఆరోగ్యకరమైన ఆయిల్ ఫ్రీ చికెన్ రెడీ. వేడివేడి అన్నం, చపాతీ లేదా మీకు నచ్చిన సలాడ్ తో కలిపి తింటే దీని రుచి అమోఘం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications