Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
చల్లారినా రుచి తగ్గని అద్భుతమైన వంటకం.. అరటికాయ మసాలా రైస్ తయారీ ఇలా
సాధారణంగా మనం అరటికాయను ఉపయోగించి వేపుడు, బజ్జీలు, లేదా సాంబార్ లో ముక్కలుగా వేసి వండుతాం. కానీ ఎప్పుడైనా అరటికాయతో రైస్ ట్రై చేశారా? ఇది వినడానికి కొత్తగా ఉన్నా, రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇది చాలా ప్రసిద్ధి.
ఒక్కసారి అరటికాయ మసాలా రైస్ రుచి చూస్తే, మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. లంచ్ బాక్స్ లో ఇది చల్లారిన తర్వాత కూడా చాలా రుచిగా ఉంటుంది. అరటికాయ మసాలా రైస్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
అరటికాయలు (కూర అరటి/పచ్చివి) - 2
ఉడికించిన అన్నం - 2 కప్పులు
శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
మినప్పప్పు - 1 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు -5
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు - అర టీస్పూన్
తెల్ల నువ్వులు - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 4
ఉల్లిపాయ - 1
కరివేపాకు - రెండు రెమ్మలు
ఇంగువ - చిటికెడు
పసుపు - అర టీస్పూన్
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
నూనె - తగినంత
కొత్తిమీర - గార్నిష్ కోసం
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో ఒక స్పూన్ నూనె లేకుండా శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి.
-పప్పులు రంగు మారుతున్నప్పుడు అందులో ఎండు మిరపకాయలు, మిరియాలు, జీలకర్ర వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. చివరగా తెల్ల నువ్వులు వేసి అవి చిటపటలాడాక స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసి వేయించాలి. అవి వేగాక ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి.
-ఇప్పుడు పచ్చి అరటికాయ చెక్కు తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను తాలింపులో వేసి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ వేసి బాగా కలపాలి. మూత పెట్టి సన్నని మంటపై అరటికాయ ముక్క మెత్తబడే వరకు మగ్గనివ్వాలి.
-అరటికాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేయాలి. అన్నం విరిగిపోకుండా మసాలా, అరటికాయ ముక్కలు అన్నానికి పట్టేలా నిదానంగా కలపాలి.
-మసాలా అంతా అన్నానికి బాగా పట్టిన తర్వాత చివరిగా ఒక స్పూన్ నెయ్యి,సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేయాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే అరటికాయ మసాలా రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications