Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
సెలబ్రిటీల ఫేవరెట్ ధం ఇడ్లీ..అదిరిపోయే రుచి..ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలంటే
భారతీయ బ్రేక్ ఫాస్ట్ లిస్ట్ లో ఇడ్లీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తేలికగా జీర్ణమవ్వడం, ఆవిరిపై ఉడకడం,నూనె లేకుండా తయారవ్వడం వంటి కారణాల వల్ల ఇది ఆరోగ్యకరమైన అల్పాహారంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే రోజూ తినే సాధారణ ఇడ్లీకి భిన్నంగా, సరికొత్త రుచితో, మరింత పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన వంటకం ఉంది. అదే ధం ఇడ్లీ. ధం అనే పదం వినగానే మనకు బిర్యానీ గుర్తొస్తుంది. అయితే ధం ఇడ్లీ మాత్రం కొద్దిమందికి మాత్రమే తెలిసిన వంటకం.
ధం ఇడ్లీ కేవలం అల్పాహారం మాత్రమే కాదు, ఒక సంపూర్ణ భోజనంగా కూడా తినవచ్చు. దీనికి ప్రత్యేకంగా సైడ్ డిష్ లు కూడా అవసరం లేదు. ధం ఇడ్లీ అనేది సంప్రదాయ ఇడ్లీకి ఆధునికతను, అదనపు రుచిని, పోషకాలను జోడించే ఒక అద్భుతమైన వంటకం. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. ఉదయం అల్పాహారంగా, మధ్యాహ్నం భోజనంగా లేదా రాత్రి తేలికపాటి డిన్నర్ గా కూడా ఇది బాగుంటుంది. చాలామంది సెలబ్రీలు దీన్ని బ్రేక్ ఫాస్ట్ లోకి ఇష్టపడుతుంతారు. టాలీవుడ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఓ ఇంటర్వ్యూలో హీరో నితిన్ ఇంట్లో ఉండే వంటమనిషి చేసే ధం ఇడ్లీని తాను షూటింగ్ స్పాట్స్ లో తినేదాన్నని అది తనకు భలే నచ్చుతుందని కూడా చెప్పారు. సెలబ్రిటీలు సైతం మెచ్చే ధం ఇడ్లీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

ధం ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-4 ఇడ్లీ
-4 గరిటల సాంబార్
-1 టేబుల్ స్పూన్ నెయ్యి
-1 టేబుల్ స్పూన్ కందిపొడి
-2 వడలు
-1 టేబుల్ స్పూన్ మామిడికాయ పచ్చడి
ధం ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా ఉడికించి చల్లారిన ఇడ్లీలను చిన్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-తర్వాత వడలను కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా తుంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి లేదా గిన్నె పెట్టి అందులో సాంబార్ పోయండి. ఇందులోనే కట్ చేసిన ఇడ్లీ, వడ ముక్కలు, మామిడికాయ పచ్చడి, కందిపొడి,నెయ్యి వేసి మీడియం మంట మీద కలుపుతూ ఉడకనివ్వాలి.
-5-6 నిమిషాల తర్వాత సాంబార్ చిక్కగా ఉంది అనిపిస్తే ఒకటిన్నర కప్పు నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ గరిటతో ఇడ్లీ, వడ ముక్కలను మెదిపినట్లు చేస్తుండండి.
-2-3 పొంగులు వచ్చాక అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ధం ఇడ్లీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications