Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
చపాతీలోకి కేక పుట్టించే బంగాళాదుంప వైట్ కుర్మా..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
చపాతీ, పూరీ అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది వేడివేడి బంగాళాదుంప కూర. ఇది తిరుగులేని కాంబినేషన్ అయినప్పటికీ, ప్రతీసారి అదే రొటీన్ కూర తిని విసుగు రావడం సహజం. మీ వంటగదిలో బంగాళాదుంపలకు ఒక సరికొత్త, రుచికరమైన రూపాన్ని ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈసారి ఘుమఘుమలాడే బంగాళాదుంప వైట్ కుర్మాను ట్రై చేసి చూడండి. కొబ్బరి, జీడిపప్పుల కమ్మదనంతో, సుగంధ ద్రవ్యాల సువాసనతో మృదువుగా ఉండే ఈ కుర్మా రుచి మిమ్మల్ని కట్టిపడేస్తుంది.
బంగాళదుంప వైట్ కుర్మా కేవలం చపాతీ, పూరీలకే కాదు.. ఇడ్లీ, దోశ వంటి బ్రేక్ ఫాస్ట్ లతో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. దీని తయారీ చాలా సులభం. ఈ కుర్మా వండి వడ్డిస్తే మీ ఇంట్లో వాళ్ళు మామూలుగా తినేదానికంటే రెండు చపాతీలు ఎక్కువే తింటారు. ఈ అద్భుతమైన బంగాళదుంప వైట్ కుర్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

బంగాళదుంప వైట్ కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు
-పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
-జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
-అల్లం - అర అంగుళం ముక్క
-వెల్లుల్లి రెబ్బలు - 3
-పచ్చిమిర్చి - 3
-సోంపు - అర టీస్పూన్
-దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క
-లవంగాలు - 3
-నూనె - 2 టేబుల్ స్పూన్లు
-యాలకులు - 2
-ఉల్లిపాయ - 1
-కరివేపాకు - ఒక రెబ్బ
-టమాటాలు - 2
-బంగాళాదుంపలు - 2
-ఉప్పు - రుచికి సరిపడా
-కొత్తిమీర - కొద్దిగా
-నీరు - అవసరమైనంత
తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో కొబ్బరి, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తని ముద్దలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, యాలకులు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి, ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారే వరకు వేయించుకోవాలి.
-ఇప్పుడు సన్నగా తరిగిన టమాటాలు, కొద్దిగా ఉప్పు వేసి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయే వరకు ఉడికించాలి.
-ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి మసాలా ముద్దను అందులో వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించాలి.
-ఇప్పుడు పెద్దగా కట్ చేసిన బంగాళాదుంప ముక్కలు వేసి మసాలాతో బాగా కలిపి కుర్మాకు సరిపడా నీళ్ళు, రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి.
-చివరగా కొత్తిమీర చల్లి, కుక్కర్ పై మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే ఎంతో రుచికరమైన, కమ్మనైన బంగాళాదుంప వైట్ కుర్మా రెడీ. కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
