Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు! -
వట్టి నీళ్లు తాగలేకపోతున్నారా? డీహైడ్రేషన్ కు చెక్ పెట్టే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే! -
మే 3, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరించనుంది.. పట్టిందల్లా బంగారం కావాల్సిందే! -
వరియాన్ యోగం, విశాఖ నక్షత్రం.. ఈరోజు మీ సంపదను ఎలా పెంచుతాయో తెలుసా? -
ఈ ఆమ్లెట్ రుచి చూశారంటే మతి పోవాల్సిందే..నోట్లో వెన్నలా కరిగిపోతుంది -
హనుమాన్ జయంతి వేడుకలు: మాల విరమణకు సిద్ధమవుతున్నారా? భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే!
బాదం మీగడ పాయసం రెసిపి ; బాదం పాల పాయసం ఎలా తయారుచేయాలి
బాదం మీగడ పాయసం మన మనస్సుకి ఎంతో నచ్చే తీపి వంటకం, అంతర్లీనంగా కుంకుమపువ్వు వాసన, బాదంతో నిండిన, ఘుమాయించే భారతీయ దినుసులతో కూడిన ఒక చెంచా అన్నం పరమాన్నం కన్నా రుచిగా ఏముంటుంది?
మనకి పాయసం లేదా పరమాన్నం ప్రతి పండగకీ, ఉత్సవాలకి తప్పనిసరి వంటకంగా మారిపోయింది. అందుకని, ఈ పండగ సమయంలో మనం బాదం మీగడ పాయసాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.ఈ ప్రత్యేక బాదం మీగడ పాయసం రెసిపి ఏ పండగకైనా బావుంటుంది, దీన్ని వండటానికి కూడా పెద్ద సమయం పట్టదు. హాయిగా చేసుకుని నచ్చినంతసేపు తింటూ ఆనందించండి.
అన్న పరమాన్నాలలో మంచి విషయం ఏంటంటే వాటిని తయారుచేయటం చాలా సులభం, చల్లగా లేదా వేడిగా ఎలా అయినా మీకు నచ్చినట్లు తినవచ్చు. అందుకని ఈ కింద ఇచ్చిన వీడియోను చూడండి లేదా స్టెప్ బై స్టెప్ చిత్రాలను చూస్తూ , ఈ మనస్సుకి, కడుపుకి శాంతినిచ్చే తీపి వంటకంతో పండగ వాతావరణాన్ని మరింత ఆనందకరంగా ఇంట్లోనే సులభంగా మార్చుకోండి.
Recipe By: మీనా భండారి
Recipe Type: తీపి వంటకం
Serves:
-
1.చక్కెర -1 చెంచా
2.పొట్టు తీసేసిన బాదం -2 చెంచాలు
3.బాస్మతి బియ్యం -2 చెంచాలు
4.ఆకుపచ్చని ఏలకుల పొడి- 1చెంచా
5.కుంకుమ పువ్వు- కొన్ని రేకులు
6.పాలు -350గ్రా
7. గట్టిపడిన పాలు -4 చెంచాలు
-
1.ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యం పోయండి.
2.నీళ్ళు పోసి 10-15 నిమిషాలు నాననివ్వండి.
3.ఒక పెనం తీసుకోండి.
4.పాలు పోసి 5-10నిమిషాలు మరగనివ్వండి.
5.నానిన బియ్యాన్ని పోసి బాగా కలపండి.
6.అన్నాన్ని 4-5 నిమిషాలు ఉడకనివ్వండి.
7. అన్నం మెత్తగా ఉన్నప్పుడు, గట్టిపడిన పాలను అందులో పోయండి.
8.బాదంపప్పులు, ఆకుపచ్చని ఏలకుల పొడి మరియు చక్కెరను దానిలో వేయండి.
9.2-3 నిమిషాల పాటు కలపండి.
10. పెనం దించేసి, అందరికీ వడ్డించేముందు కుంకుమపువ్వుతో అలంకరించండి.
- 1.బియ్యాన్ని ముందే నానబెట్టి ఉంచుకుంటే త్వరగా ఉడుకుతుంది. 2.పాలు మరుగుతున్నప్పుడు పాయసం గడ్డకట్టకుండా కలుపుతూనే ఉండండి.
- వడ్డించే పరిమాణం - 1 బౌల్
- క్యాలరీలు - 490క్యాలరీలు
- కొవ్వు - 6గ్రా
- ప్రొటీన్ - 41గ్రా
- కార్బొహైడ్రేట్లు - 51గ్రా
- చక్కెర - 5 గ్రా
- పీచు పదార్థం - 4గ్రా
స్టెప్ బై స్టెప్ - ఎలా తయారుచేయాలి
1.ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యం పోయండి.
2.నీళ్ళు పోసి 10-15 నిమిషాలు నాననివ్వండి.
3.ఒక పెనం తీసుకోండి.
4.పాలు పోసి 5-10నిమిషాలు మరగనివ్వండి.
5.నానిన బియ్యాన్ని పోసి బాగా కలపండి.
6.అన్నాన్ని 4-5 నిమిషాలు ఉడకనివ్వండి.
7. అన్నం మెత్తగా ఉన్నప్పుడు, గట్టిపడిన పాలను అందులో పోయండి.
8.బాదంపప్పులు, ఆకుపచ్చని ఏలకుల పొడి మరియు చక్కెరను దానిలో వేయండి.
9.2-3 నిమిషాల పాటు కలపండి.
10. పెనం దించేసి, అందరికీ వడ్డించేముందు కుంకుమపువ్వుతో అలంకరించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications

































