Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
శీతాకాలానికి ఓ పవర్ ఫుల్ మెడిసిన్..ఆంధ్రా స్పెషల్ వంకాయ రసం..ఎలా చేసుకోవాలంటే
రసం పేరు వినగానే చాలామందికి నోట్లో నీళ్లూరుతుంటాయి. వర్షం పడుతున్న సమయంలో లేదా చల్లటి వాతావరణం ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో గరం గరం రసం పోసుకొని తీంటుంటే ఆ మజా మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. రసం అనేది కేవలం రుచికరమైన వంటకం మాత్రమే కాదండోయ్..శీతాకాలంలో ఓ పవర్ ఫుల్ మెడిసిన్ గా కూడా పనిచేస్తుంది. కొంతమందికి అయితే ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా రోజూ రసం ఉండి తీరాల్సిందే. రసాన్ని గ్లాసులో పోసుకొని తాగేవాళ్లు కూడా ఉంటారు. అయితే ఎప్పుడూ అదే స్టైల్ రసం తిని తిని బోర్ కోట్టినట్లు అనిపించిందా? అయితే ఓ సారి ఆంధ్రా స్టైల్ వంకాయ రసం ట్రై చేయండి.
ఆంధ్రా స్టైల్ వంకాయ రసం చేస్తే మీరు ప్రత్యేకంగా గ్రేవీ వేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టపడతారు. వంకాయ ఇష్టపడని వారు కూడా దీన్ని ఇష్టపడతారు. దీన్ని తయారు చేయడం చాలా సులభం. ఆంధ్రా స్టైల్ వంకాయ రసం తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

వంకాయ రసం తయారీకి కావాల్సిన పదార్థాలు
-వంకాయ - పావు కిలో
-నూనె - 2 చెంచాలు
-ఆవాలు - 1 చెంచా
-ఎండు మిరపకాయలు - 2
-జీలకర్ర - 1 చెంచా
-మెంతి పొడి - అర చెంచా
-కరివేపాకు - కొద్దిగా
-చింతపండు రసం - అర కప్పు
-ఉల్లిపాయ - 1
-పచ్చిమిర్చి - 2
-బెల్లం తురుము - 2 చెంచాలు
-కొత్తిమీర - కొంచెం
తయారీ విధానం
-ముందుగా వంకాయ పైభాగంలో తేలికగా నూనె రాసి, ఓవెన్ ను మీడియం మంట మీద ఉంచి వంకాయను కాల్చండి. ఓవెన్ లేకుంటే స్టవ్ మీద ప్టాండ్ పెట్టి అయినా కాల్చుకోవచ్చు.
-తర్వాత కాల్చిన వంకాయ మీద కొద్దిగా నీరు చల్లి, దాని తొక్క తొలగించి ఒక గిన్నెలో ఉంచండి.
-ఇప్పుడు వంకాయను ఒక చెంచాతో గుజ్జు చేయండి.
-బాగా మెత్తగా అయిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలపాలి.
-తర్వాత అందులో బెల్లం, అవసరమైన మొత్తంలో ఉప్పు వేసి బాగా కలపండి.
-తర్వాత నాబెట్టిన చింతపండు ద్రావణం, 1 కప్పు నీరు వేసి బాగా కరిగించండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత తరిగిన ఎర్ర మిరపకాయలు, పసుపు పొడి, కరివేపాకు వేసి వేయించాలి.
-ఇప్పుడు వేయించిన పదార్థాలను తీసుకొని తయారుచేసిన వంకాయ రసంలో వేస్తే రుచికరమైన ఆంధ్రా స్టైల్ వంకాయ రసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
