Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఆంధ్రా స్టైల్ పచ్చిమిర్చి పచ్చడి..వానాకాలంలో వేడి వేడి అన్నంలో తింటే స్వర్గమే..ఎలా చేసుకోవాలంటే
పచ్చిమిరపకాయలను సాధారణంగా కూరల్లో,పచ్చళ్లలో కారం కోసం ఉపయోగిస్తుంటారు. అలాంటి పచ్చిమిర్చితోనే ఓ పచ్చడి చేస్తే టేస్ట్..ఊ హిస్తేనే అద్భుతంగా ఉంది కదూ. వర్షాకాలంలో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి కలిపి తింటే ఆ రుచిని మాటల్లో వర్ణించలేం. పచ్చిమిరపకాయ పచ్చడి అద్భుతమైన రుచితో పాటు దీని తయారీలో ఉపయోగించే పదార్థాలన్నీ ఆరోగ్యానికి బోలెడు మేలు చేసేవే. పచ్చిమిరపకాయ పచ్చడిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరులో తయారుచేస్తుంటారు. అయితే ఆంధ్రా స్లైల్ లో రుచితో పాటు బోలెడు ఆరోగ్యప్రయోజనాలను కూడా అందించే పచ్చిమిరపకాయ పచ్చడిని మీ ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
పచ్చిమిర్చి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఆయిల్
-మిరపకాయలు
-చింతపండు
-పచ్చి శెనగపప్పు
-టమాటోలు
-పసుపు
-ఎండుమిర్చి
-జీలకర్ర
-ఆవాలు
-మినపప్పు
-మెంతులు
-వెల్లుల్లి
-కరివేపాకు

పచ్చిమిర్చి పచ్చడి తయారీ విధానం
-ముందుగా నిమ్మకాయ సైజు అంత చింతపండుని నీళ్లలో నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, చిటికెడు మెంతులు వేసి వేయించాలి.
-తర్వాత అందులో 75 గ్రాముల కారంగా ఉండే బజ్జీ మిరపకాయలను ముక్కలుగా కట్ చేసి వేసి బాగా మగ్గనివ్వాలి.
-మగ్గిన మిరపకాయల ముక్కల్లో 3 టమాటోల పెద్ద ముక్కలు,కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి టమాటోలను మెత్తబడే దాకా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో వేయించిన అన్నింటిని వేసి ఇందులో నానబెట్టిన చింతపండును కూడా వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు తాళింపు కోసం స్టవ్ మీద పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి ఇందులో 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 7-8 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
-తాళింపు వేగిన తర్వాత అందులో బరకగా గ్రైండ్ చేసిన పచ్చడిని వేసి బాగా కలపండి.
-చివరలో స్టవ్ ఆఫ్ చేసే ముందు పచ్చడిలో కొంచెం ఎక్కువగా కొత్తిమీర తరుగు వేసి కలుపుకోండి. అంతే ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
