Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
కమ్మటి సువాసన,నోరూరించే రుచి..పెళ్లిళ్లలో చేసే అచ్చమైన ఆంధ్రా సాంబార్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
ఆంధ్రా పెళ్లి భోజనం అంటే అదొక వేడుక, అదొక అనుభూతి. అరటి ఆకు మీద వరుసగా వడ్డించే పచ్చళ్లు, వేపుళ్లు, అన్నం, నెయ్యి, పప్పు.. ఇలా ఒక్కోటి వడ్డిస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అయితే,ఈ భోజనానికి ఆత్మ వంటిది, ఆ భోజన పంక్తి మొత్తాన్ని తన సువాసనతో ముంచెత్తేది మాత్రం ఒక్కటే.. అదే సాంబార్. సాధారణంగా ఇళ్లలో చేసుకునే సాంబార్ కి, పెళ్లిళ్లలో వడ్డించే సాంబార్ కి రుచిలో, వాసనలో చాలా తేడా ఉంటుంది. ఆ సాంబార్ గరిటెతో అన్నంలో పడగానే వచ్చే కమ్మని వాసన, నోట్లో పెట్టుకుంటే పులుపు, తీపి, కారం, ఉప్పు సమపాళ్లలో కలిసి నాలుకపై నాట్యమాడే ఆ రుచి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పెళ్లిళ్ల స్పెషల్ సాంబార్ ని మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
-కందిపప్పు
-పసుపు
-నీళ్లు
-సాంబార్ పౌడర్
-మునక్కాయ
-క్యారెట్
-బెండకాయ
-వంకాయ
-ఉల్లిపాయలు
-వెల్లుల్లి
-టమాటాలు
-పచ్చిమిర్చి
-చింతపండు
-కారం
-ఆయిల్
-బెల్లం
-ఉప్పు
-ఎండు మిరపకాయలు
-ఆవాలు
-జీలకర్ర
-కరివేపాకు
-కొత్తిమీర తరుగు
తయారీ విధానం
-ముందుగా నిమ్మకాయ సైజు అంత చింతపండులో ఒక కప్పు నీళ్లు,కొద్దిగా ఉప్పు వేసి కనీసం 5 నిమిషాలు నానబెట్టుకోండి. తర్వాత పిప్పిని పడేసి రసాన్ని 1 కప్పు వడకట్టి తీసి పక్కన పెట్టుకోండి
-తర్వాత ముప్పావు కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగి, రెండున్నర కప్పుల నీళ్లు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ నూనె వేసి ప్రెషర్ కుక్కర్లో మెత్తగా 4-5 విజిల్స్ వచ్చే వరకు పప్పును మెత్తగా ఉడికించాలి. ఆవిరి పోయిన తర్వాత, పప్పును గరిటెతో బాగా మెత్తగా మెదపాలి.
-ఇప్పుడు ఆ మెత్తని పప్పులోనే 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 1 మీడియం సైజ్ క్యారెట్ ముక్కలు, 2 బెండకాయల ముక్కలు, 1 మునక్కాయ ముక్కలు, 1 వంకాయ ముక్కలు, 1 బంగాళదుంప ముక్కలు, 1 పెద్ద టమాటో ముక్కలు, 5 పచ్చిమిర్చి పొడవాటి చీలికలు వేసి కలిపాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ కారం, 1 కప్పు చింతపండు రసం, అరకప్పు నీళ్లు పోసి బాగా కలిపి మూతపెట్టేసి మీడియం మంట మీద 1 విజిల్ వచ్చేదాకా ఉడికిస్తే సరిపోతుంది.
-ఒకసారి కూరగాయ ముక్కలు ఉడికినాయో లేదో చెక్ చేసుకోండి. కూరగాయ ముక్కలు ఉడికినట్లు ఉంటే అప్పుడు అందులో 1 టీస్పూన్ బెల్లం తురుము, 2 టీస్పూన్ల సాంబార్ పౌడర్ వేసి కలిపాక ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కలిపి 5 నిమిషాలు మీడియం మంట మీద బాగా మరిగించాలి.
-ఈలోగా తాలింపును రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పోపు గిన్నెను పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచిన 8 వెల్లుల్లి రెబ్బలు వేసి తక్కువ మంట మీద 1 నిమిషం వెయించుకోండి. వెల్లుల్లి కొద్దిగా వేగాక అందులో అర టీస్పూన్ ఆవాలు,3 ఎండు మిర్చి ముక్కలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాక 1 ఉల్లిపాయ తరుగు,కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.
-ఇప్పుడు తాలింపుని సాంబార్ లో వేసి బాగా కలుపుకోండి.సాంబార్ ని ఒక నిమిషం పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే వెడ్డింగ్ స్పెషల్ సాంబార్ రెడీ. వేడి వేడి అన్నం లేదా టిఫిన్స్ తో ఈ సాంబార్ ని కలుపుకొని తింటుంటే మాటల్లో చెప్పలేని రుచి అంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








