Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
అరిసెలను తలపించే..అమృతంలా అనిపించే వరలక్ష్మీ వ్రతం స్పెషల్ అప్పాలు..ఎలా చేసుకోవాలంటే
హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన పండుగల్లో వరలక్ష్మీ వ్రతం ఒకటి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. సిరి సంపదలకు, ఐశ్వర్యానికి ప్రతీక అయిన లక్ష్మీదేవిని ఆరాధించడానికి ఈ వ్రతం విశేష ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ వ్రతంలో వివిధ రకాల ప్రసాదాలను అమ్మవారికి నివేదిస్తారు. వాటిలో అప్పాలు చాలా ముఖ్యమైనవి, ఇవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యంగా భావిస్తారు.
అప్పాలు తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయబద్ధమైన ప్రసాదం. దీనిని తయారుచేసి నివేదించడం ద్వారా పూర్వీకుల ఆచారాలను గౌరవించినట్లవుతుంది. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడినట్లవుతుంది. వరలక్ష్మీ వ్రతానికి ఎక్కువగా చేసే అప్పాలు ప్రసాదానికే కాకుండా ఎప్పుడైనా తినడానికి పర్ఫెక్ట్ గా ఉంటాయి. అప్పాలను పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం పిండి
-గోధుమ పిండి
-ఉప్మా రవ్వ
-బెల్లం
-యాలకలు
-ఆయిల్
-నెయ్యి
అప్పాలు తయారీ విధానం
-ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు ఉప్మా రవ్వ వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 కప్పుల బెల్లం తరుము వేసి 3 కప్పులు నీళ్లు అందులో పోయండి. 1 యాలకను దంచి అందులో వేసి బెల్లం కరగనివ్వాలి.
-బెల్లం కరిగిపోయి నీరు తెర్లుతున్నప్పుడు అందులో కలిపిన పిండిని వేసి మీడియం మంట మీద ఉండలు కట్టకుండా దగ్గర పడేదాకా కలుపుకోవాలి.
-దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూతపెట్టి కొద్దిసేపు వదిలేయండి.
-తర్వాత మూత తీసి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండి మొత్తాన్ని మెత్తగా కలుపుకోవాలి.
-ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం చేతుల్లోకి తీసుకొని అరచేతిలో పెట్టుకొని లేదా ప్లాసిక్ కవర్ మీద అయినా అప్పాలుగా వత్తుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లోనే డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చేసి అందులో వత్తుకున్న అప్పాలు వేసి రెండు వైపులకు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించాలి. తర్వాత రెండు గరిటలతో వత్తుకొని తీసి టిఫ్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకుంటే అందులోని మిగిలిన నూనె పీల్చుకుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications