Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
మైదా పిండి అవసరమే లేదు.. ఇంట్లోనే జ్యూసీగా నోరూరించే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా.!
బాదుషా.. ఈ స్వీట్ పేరు తలచుకుంటేనే చాలు ఎవరికైనా సరే ఇట్టే నోరూరిపోతుంది. ఎదురుగా కనిపిస్తే తినకుండా ఉండలేరు. కానీ డైట్ పాటించేవారు తప్పక కంట్రోల్ చేసుకుంటారు. ఎందుకంటే బాదుషాలో ఎక్కువగా ఉపయోగించేది మైదా పిండి. అందుకే కొందరు దీనికి దూరంగా ఉంటారు. అయితే అలాంటి భయమేమీ లేకుండా మైదా ఉపయోగించకుండా హెల్తీగా గోధుమ పిండితో బాదుషాలను ట్రై చేయవచ్చని మీకు తెలుసా.. అది కూడా స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్‌తో.. తయారీ విధానం చూద్దాం..

గోధుమ పిండి బాదుషా తయారీకి కావాల్సిన పదార్థాలు..
గోధుమ పిండి- 250 గ్రాములు
ఉప్పు- చిటికెడు
వంటసోడా- పావు టీస్పూన్
బేకింగ్ పౌడర్- పావు టీస్పూన్
చక్కెర- రెండు టీస్పూన్లు
నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు
తాజా పెరుగు- మూడు టీస్పూన్లు
బాదుషాలకి పాకం కోసం
చక్కెర- పావు కేజీ
నీళ్లు- రెండు కప్పులు
ఏలకులు- మూడు
కుంకుమపువ్వు- కొద్దిగా(ఆప్షనల్)
నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
గోధుమ పిండి బాదుషా తయారీ విధానం
ముందుగా గోధుమ పిండిని జల్లెడ పట్టుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు, వంట సోడా, బేకింగ్ పౌడర్, చక్కెర, నెయ్యి, తాజా పెరుగు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి.
పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
ఇప్పుడు ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా పిండి ముద్దను కలుపుకోవాలి. దీనిని కనీసం అరగంట నుంచి గంటసేపు నాననివ్వాలి. అప్పుడే బాదుషాలు బాగా వస్తాయి.
ఈ లోపు పాకం రెడీ చేసుకోవాలి. దాని కోసం ఎంత మొత్తంలో గోధుమ పిండి తీసుకున్నామో అదే మొత్తంలో చక్కెరను ఒక వెడల్పాటి కడాయిలోకి తీసుకుని అందులో అంతే మొత్తం నీళ్లు పోసి స్టవ్‌పైన పెట్టి కరగనివ్వాలి.

ఇందులో దంచిన ఏలకులు, కుంకుమ పువ్వు వేసి మరగనివ్వాలి. చక్కెర కరిగిన తర్వాత నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం మంట పైన మరిగించుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా తీగ పాకానికంటే కొంచెం తక్కువగా స్టిక్కీగా వచ్చేలా పాకం చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని చల్లారనివ్వాలి.
ఇప్పుడు గోధుమ పిండి ముద్దను చిన్న ఉండలుగా చేసుకుని వాటిపైన కొంచెం అదిమి.. మధ్యలో వేలితో కొంచెం గుండ్రంగా తిప్పాలి. ఇలా అన్నిటినీ చేసి పెట్టుకోవాలి.
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి!
స్టవ్‌పైన బాణలి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి కాగనివ్వాలి. మీడియం మంట పైన పెట్టి వీటిని ఒక్కొక్కటిగా వేసుకుని రెండు వైపులా క్రిస్పీగా అయ్యేవరకు వేగనివ్వాలి.

ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత వీటిని చక్కెర పాకంలో వేసుకోవాలి. బాదుషాలు బాగా పాకాన్ని పీల్చుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే..
మైదా పిండిని ఇష్టపడిని వారు స్వీట్ తినాలనిపిస్తే ఇలా హెల్తీగా గోధుమ పిండితో బాదుషాలు ట్రై చేయండి. టేస్ట్‌కు ఫిదా అయిపోతారు.
ఈ శ్రావణ మాసంలో రానున్న పండుగలకి, రాఖీ పౌర్ణమికి బయట కొనకుండా ఇలా ఇంట్లో గోధుమ పిండితో బాదుషాలు మీ పండుగను మరింత రెట్టింపు చేస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
