Latest Updates
-
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
నోరూరించే బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై..ఈజీగా ఎలా చేసుకోవాలంటే
భారతీయ వంటకాల్లో బెండకాయ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించింది. ఇది కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు పోషకాలతో నిండిన ఒక సంపద. బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని తరుచుగా పెద్దలు చెబుతుండం మనం చూస్తుంటాం. బెండకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. దీంతో అనేక రకాల వంటకాలను తయారు చేయవచ్చు. అందులోనూ బెండకాయ వెల్లుల్లి కారం అనేది ఒక సంప్రదాయమైన, చాలా రుచికరమైన వంటకం.
బెండకాయ వెల్లుల్లి కారంని అన్నంతో కలిపి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. మాటల్లో వర్ణించలేని టేస్ట్ దీని సొంతం. ఈ వంటకం రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెండకాయ, వెల్లుల్లి రెండింటిలోనూ అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. బెండకాయ వెల్లుల్లి కారం వంటకం తయారీ కూడా చాలా సులభం, పైగా దీనికి పెద్దగా ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. బెండకాయ వెల్లుల్లి కారం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

బెండకాయ వెల్లుల్లి కారం తయారీకి కావాల్సిన పదార్థాలు
-బెండకాయలు
-ఉప్పు
-వెల్లుల్లిపాయలు
-ఎండు మిరపకాయలు
-ధనియాలు
-జీలకర్ర
-పచ్చి శెనగపప్పు
-ఆయిల్
బెండకాయ వెల్లుల్లి కారం తయారీ విధానం
-ముందుగా పావు కేజీ బెండకాయలను శుభ్రంగా కడగండి.
-కడిగిన బెండకాయలను 2 ఇంచు ముక్కలుగా కట్ చేసుకోండి. అన్ని బెండకాయలను సమానంగా కట్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి శెనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోనే 10-12 ఎండుమిరపకాయలు వేసి అవి కలర్ మారేదాకా వేయించుకొని స్టవ్ ఆపేయాలి.
-చల్లారనిన తర్వాత వాటన్నింటినీ మిక్సీ జార్ లో వేసి 7-8 వెల్లుల్లిపాయలు వేసి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తగా పొడి చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
-ఆయిల్ వేడెక్కాక అందులో కట్ చేసిన బెండకాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
-బెండకాయ ముక్కలు కలర్ మారిన తర్వాత అందులో పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి వేసి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. 2-3 నిమిషాలు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేయండి. అంతే బెండకాయ వెల్లుల్లి కారం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
