Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
తియ్యగా, పుల్లగా ప్లాస్టిక్ పచ్చడి..తింటే ఎవ్వరైనా సూపర్ అనాల్సిందే!
భారతీయ వంటకాలలో పచ్చళ్ళకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే మీరు ఎప్పుడైనా ప్లాస్టిక్ పచ్చడి గురించి విన్నారా? పేరు వినగానే ఇది ప్లాస్టిక్ తో చేస్తారేమో అని కంగారు పడకండి..ఇది పూర్తిగా సహజమైన పదార్థాలతో చేసే అత్యంత రుచికరమైన వంటకం.
పశ్చిమ బెంగాల్ సంప్రదాయంలో ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలలో వడ్డించే ఈ స్వీట్ చట్నీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని పచ్చి బొప్పాయితో తయారు చేస్తారు. బొప్పాయి ముక్కలు పంచదార పాకంలో ఉడికిన తర్వాత గాజులాగా, పారదర్శకంగా మారుతాయి. అచ్చం కరిగిన ప్లాస్టిక్ లాగా మెరుస్తూ కనిపించడం వల్ల దీనికి ప్లాస్టిక్ పచ్చడి అని పేరు వచ్చింది.

కావలసిన పదార్థాలు
పచ్చి బొప్పాయి: 1
పంచదార: 1.5 కప్పులు
నీళ్లు: 2 కప్పులు
నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: చిటికెడు
ఎండు ద్రాక్: గుప్పెడు
జీడిపప్పు: గుప్పెడు
ఉప్పు: చిటికెడు
కలోంజి (నల్ల జీలకర్ర): చిటికెడు
తయారీ విధానం
-ముందుగా పచ్చి బొప్పాయిని శుభ్రంగా కడగాలి. దాని పై తొక్కను పూర్తిగా తీసివేయాలి. లోపల ఉన్న గింజలను, తెల్లటి పొరను కూడా తీసివేయాలి.
-ఇప్పుడు బొప్పాయిని చాలా పలుచటి, చిన్న చతురస్రాకారపు ముక్కలుగా (చిప్స్ లాగా) కోసుకోవాలి. ముక్కలు ఎంత పలుచగా ఉంటే, ఉడికిన తర్వాత అవి అంత పారదర్శకంగా, ప్లాస్టిక్ లాగా కనిపిస్తాయి. లేదా మీరు బొప్పాయిని తురుముకుని (Grated) కూడా వాడుకోవచ్చు కానీ ముక్కలుగా కోస్తేనే అసలైన ప్లాస్టిక్ లుక్ వస్తుంది.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత అందులో తరిగిన బొప్పాయి ముక్కలను వేసి, ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. ముక్కలు మెత్తబడకూడదు, కేవలం సగం ఉడికితే చాలు. ఇప్పుడు నీటిని వంపేసి ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఈ స్టెప్ వల్ల బొప్పాయిలో ఉండే పచ్చి వాసన పోతుంది.
-ఇప్పుడు మరొక పాన్ తీసుకుని అందులో 2 కప్పుల నీళ్లు, పంచదార వేసి మరిగించాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత, అందులో చిటికెడు ఉప్పు వేయాలి.
-పంచదార పాకం మరుగుతుండగా, ముందుగా సగం ఉడికించి పెట్టుకున్న బొప్పాయి ముక్కలను అందులో వేయాలి. మంటను మీడియంలో పెట్టి మూత పెట్టి ఉడికించాలి. బొప్పాయి ముక్కలు పంచదార పాకాన్ని పీల్చుకుని, గాజులాగా పారదర్శకంగా మారే వరకు సుమారు 10-15 నిమిషాలు ఉడికించాలి.
-పాకం చిక్కబడటం మొదలయ్యాక (తీగ పాకం రాకూడదు, తేనె లాంటి చిక్కదనం ఉండాలి), అందులో ఎండు ద్రాక్ష, జీడిపప్పు,కల్లోంజి వేయాలి. రుచి కోసం యాలకుల పొడిని కూడా కలపాలి.
-చివరగా స్టవ్ ఆపేసే ముందు, నిమ్మరసం పిండాలి. నిమ్మరసం వేయడం చాలా ముఖ్యం. ఇది పచ్చడికి పుల్లటి రుచిని ఇవ్వడమే కాకుండా, చల్లారిన తర్వాత పంచదార గట్టిపడకుండా చూస్తుంది.
-స్టవ్ ఆపేసి, పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి. దీనిని భోజనం చివరలో డెజర్ట్ లాగా లేదా అన్నంతో పాటు వడ్డించవచ్చు. ఇది తీపి, పులుపు కలగలిసిన అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications