Latest Updates
-
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.!
నో చట్నీ, నో ప్రాబ్లమ్..ఈ కొబ్బరి పొడి ఉంటే టిఫిన్ అదిరిపోద్ది..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఉదయం టిఫిన్ కోసం ఇడ్లీ, దోశ వంటివి చేసుకున్నప్పుడు వాటిలోకి చట్నీ చేయడం కాస్త సమయంతో కూడుకున్న పని. కొన్నిసార్లు చట్నీ చేయడానికి చేతిలో తగినంత సమయం ఉండదు లేదా ఇంట్లో పచ్చి కొబ్బరి, పల్లీలు అందుబాటులో ఉండకపోవచ్చు. సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే మీకు ఎంతగానో ఉపయోగపడేది కొబ్బరి కారం పొడి.
ఇది కేవలం నిమిషాల్లో తయారవ్వడమే కాదు, ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పొడి చేయడానికి మన వంటగదిలో ఉండే సాధారణ పదార్థాలు సరిపోతాయి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్న లేదా ఇడ్లీ, దోశల్లో నంజుకు తిన్నా దీని రుచి అమోఘం. నోరూరించే ఈ కొబ్బరి పొడిని పక్కా కొలతలతో, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఎండు కొబ్బరి ముక్కలు లేదా తురుము: 1 కప్పు
మినపప్పు (గుళ్ళు): అర కప్పు
వేరుశనగ గుళ్ళు (పల్లీలు): 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు: 10
కాశ్మీరీ ఎండుమిర్చి: 6
చింతపండు: 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు: 8
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని, అందులో అర చెంచా నూనె వేసి వేడి చేయండి.
-నూనె వేడెక్కాక మినపప్పు, వేరుశనగ గుళ్ళు, ఎండు మిరపకాయలు, కశ్మీరీ మిర్చి వేయండి. మంటను సిమ్ లో ఉంచి, పప్పులు బంగారు రంగులోకి మారి మంచి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి.
-వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో మరికొంచెం నూనె వేసి, ఎండు కొబ్బరి ముక్కలను వేయండి. కొబ్బరి త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దోరగా బంగారు వర్ణం వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోండి.
-చివరగా అదే పాన్ లో వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చి వాసన పోయేలా కాసేపు వేయించాలి. తర్వాత చింతపండును కూడా వేసి ఒక నిమిషం పాటు వేడి చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఆ వేడికి కాసేపు మగ్గనివ్వాలి.
-వేయించుకున్న పదార్థాలన్నీ పూర్తిగా చల్లారే వరకు వేచి ఉండండి. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులో అస్సలు నీళ్ళు పోయకూడదు. మిక్సీని ఆపుతూ, ఆన్ చేస్తూ పొడిని కాస్త బరకగా రుబ్బుకోవాలి.
-మీ ఇంట్లో రోలు ఉండే అందులో దంచుకోండి. రుచి మిక్సీలొ పట్టినదానికంటే ఇంకా బాగుంటుంది.
-తయారైన పొడిని ఒక వెడల్పాటి ప్లేట్లో పోసి కాసేపు ఆరనివ్వండి. వేడి పూర్తిగా తగ్గిన తర్వాత గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోండి.
-వేడి వేడి దోశె వేసి, దానిపై ఈ కొబ్బరి పొడిని చల్లి, కాస్త నువ్వుల నూనె లేదా నెయ్యి వేసుకుని తింటే స్వర్గం కనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications