Latest Updates
-
Veteran Congress Leader KP Unnikrishnan Dies in Kozhikode: Remembering the Architect of Gulf Evacuation -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే.. -
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే.. -
వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన సోంపు షర్బత్..ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
Holi 2026: ఇంట్లోనే సహజసిద్ధమైన హోలీ రంగులు..తయారు చేసుకోండిలా! -
Thalapathy Vijay's father SA Chandrasekhar Old Remark Goes Viral After Wife Sangeetha Files For Divorce -
Lunar Eclipse 2026: ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం..మీ రాశిపై ఎలాంటి ఫ్రభావం ఉంటుందో చూడండి! -
నోరూరించే కొబ్బరి అటుకుల ఉప్మా: 10 నిమిషాల్లో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్! -
మఖానా vs వేయించిన శనగలు..బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
దోశ, ఇడ్లీ రుచిని రెట్టింపు చేసే మధురై స్పెషల్ టమాటో తన్నీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
ప్రతిరోజూ ఉదయం చాలా మంది ఇళ్లలో తరచుగా ఇడ్లీలు, దోశలు వేస్తుంటారు. అయితే వీటిలోకి సైడ్ డిష్‌గా ఏం చేస్తున్నాం అన్నదే అసలైన ప్రశ్న. రోజూ రొటీన్ గా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో తిని తిని మీకు బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త కొత్తగా తమిళనాడులోని మధురై వీధుల్లో ఫేమస్ అయిన టమాటో తన్నీ చట్నీ ట్రై చేయండి.
తన్నీ చట్నీ అంటే కొంచెం పల్చగా, నీళ్ళలా ఉండే కమ్మటి చట్నీ అన్నమాట. ఇది వేడి వేడి ఇడ్లీలలోకి ఎంత బాగుంటుందంటే, సాంబార్ లేకపోయినా సరే ఇడ్లీలు లాగించేస్తారు. ఇంట్లో ఉండే ఉల్లి, టమాటో, ఎండుమిర్చితో కేవలం 10-15 నిమిషాల్లో దీనిని తయారు చేసుకోవచ్చు. నోరూరించే మధురై స్పెషల్ చట్నీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
నీళ్లు - 2 కప్పులు
ఎండు మిరపకాయలు - 10
టమోటాలు - 2
ఉల్లిపాయలు - 3
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో సుమారు 2 గ్లాసుల నీళ్లు పోసి బాగా మరిగించండి. నీళ్లు మరుగుతుండగా అందులో ఎండు మిరపకాయలు, టమోటాలు అలాగే వేయండి, తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయాలి. వీటిని సుమారు 10 నిమిషాల పాటు మీడియం మంటపై బాగా ఉడికించాలి.
-టమోటాల పై తొక్క విడిపోవడం ప్రారంభమైనప్పుడు, అవి బాగా ఉడికాయని అర్థం. వెంటనే స్టవ్ ఆపివేసి, నీళ్లను వంపేసి (ఈ నీళ్లను పారబోయకండి, చట్నీలో వాడుకోవచ్చు) ఉల్లి, టమాటో, మిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత, టమోటాల పైనున్న తొక్కను తీసేయాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఉడికించిన ఎండు మిరపకాయలను వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకున్నాక అందులోనే తొక్క తీసిన టమోటాలు, ఉడికించిన ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. దీనిని మరీ మెత్తటి పేస్ట్ లా కాకుండా, కొంచెం బరకగా అంటే కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
-మిక్సీ పట్టిన మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి పల్చగా కలుపుకోవాలి.
-చివరిగా తాలింపు కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి నూనె వేడి చేయండి. అందులో ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి చిటపటలాడించి ఆ తాలింపును చట్నీలో కలపండి. అంతే గుమగుమలాడే మధురై టమాటో చట్నీ రెడీ.
-ఈ చట్నీని వేడి వేడి ఇడ్లీలపై పోసుకుని తింటుంటే ఆ రుచే వేరు. ఇడ్లీతో మాత్రమే కాదు, దోశ, ఊతప్పం, పొంగల్ వంటి వాటితో కూడా ఇది అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











