Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
నోటికి స్వర్గాన్ని చూపించే పచ్చికారం ఆలూ కూర..ఈ ఒక్క మసాలాతో మ్యాజిక్
ఆలూ లేదా బంగాళదుంప కర్రీ అంటే దాదాపు అందరూ ఇష్టపడతారు. బంగాళదుంపతో రకరకాల వెరైటీ వంటలు తయారుచేస్తుంటారు. ఆలూ ఫ్రై, ఆలూ గ్రేవీ ఇలా చాలా వెరైటీలు తయారుచేస్తుంటారు. అయితే పచ్చికారంతో చేసే ఆలూ కూర నోటికి స్వర్గాన్ని అందిస్తుంది. దీనిని తయారుచేసుకోవడం చాలా చాలా ఈజీ. ఎక్కువ సమయం పట్టదు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు కూడా రెగ్యులర్ గా వంటగదిలో ఉండేవే. పచ్చికారంతో ఆలూ కూర మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-బంగాళదుంపలు
-కొత్తిమీర
-వేరుశెనగపప్పు
-జీలకర్ర పొడి
-ధనియాల పొడి
-ఉప్పు
-ఉల్లిపాయ
-వెల్లుల్లి
-పచ్చిమిరపకాయలు
-దాల్చిన చెక్క
-యాలకలు
-లవంగ మొగ్గలు
-పుదీనా
-ఆయిల్

తయారీ విధానం
-3 మీడియం సైజు బంగాళదుంపలు(250-300గ్రాములు)శుభ్రంగా కడిగి పైన చెక్కను తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసి ఇవి మునిగేంతవరకు నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు ఇందులో వేసి మధ్యమధ్యలో కలుపుతూ బంగాళదుంప ముక్కలను కొద్దిగా పలుకుగా అంటే 70-80 శాతం ఉడికించాలి.
-బంగాళదుంప ముక్కలు ఉడికేలోగా మిక్సీ గిన్నెలో 8 పచ్చిమిరపకాయలు, 8 వెల్లుల్లి రెబ్బలు అర అంగుళం అల్లం ముక్క, 1 అంగుళం దాల్చిన చెక్క, 2 యాలకలు, 2 లవంగాలు, 3 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు, కొద్దిగా పుదీనా ఆకు, 1 కట్ట కొత్తిమీరను కాడలతో సహా వేసి కొంచెం నీళ్లు కలుపుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉడికాక బంగాళదుంపముక్కలను స్టవ్ మీద పాన్ లో నుంచి ఓ గిన్నెలోకి తీసి పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద అదే పాన్ లోని నీరుని పారబోశాక అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేశాక అర టీస్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయ సన్నని ముక్కలు వేసి కలుపుతూ బాగా ఫ్రై చేయండి.
-ఉల్లిపాయలు 50శాతం వేగాక అందులో పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలిపాక ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ను కూడా వేసి కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేవరకు బాగా ఫ్రై చేయాలి.
-ఇప్పుడు అందులో అర టీస్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపాక ఇందులో ఉడికించి పక్కన ఉంచి బంగాళదుంప ముక్కలను వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మూతపెట్టి 3 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.
-తర్వాత మూత తీసి అందులో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దించేముందు కొత్తిమీర తరుగు కూరలో చల్లుకొని కలపండి. అంతే ఆలూ పచ్చికారం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
