Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
బజ్జీ కాదు.. ఇది మిర్చి వడ..రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
సాయంత్రం సమయంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించడం సహజం. ఈ సందర్భంలో సాధారణంగా ఇంట్లో చేసుకొని అయినా లేదా బజారుకు వెళ్లో సాయంత్రం సమయంలో మిర్చి బజ్జీలు తింటుంటాం. కానీ ఎప్పుడూ తినే బజ్జీలు కాకుండా, ఈసారి కొంచెం వెరైటీగా మిర్చితో వడ ట్రై చేసి చూడండి.
రాజస్తాన్ వీధుల్లో దొరికే ఈ స్ట్రీట్ ఫుడ్ రుచి అద్భుతంగా ఉంటుంది. పైన కరకరలాడే శనగపిండి కోటింగ్, లోపల ఘాటైన మిరపకాయ, దానిలోపల గుబాళించే బంగాళాదుంప మసాలా..తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. ఈ వడలోని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో వాడే సుగంధ ద్రవ్యాలు, స్టఫింగ్. రాజస్తాన్ స్పెషల్ మిర్చి వడ మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఉడికించి మెదిపిన బంగాళదుంపలు - 4 (పెద్దవి)
సోంపు- 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
కారం - రుచికి తగినంత
ఆమ్చూర్ పొడి (మామిడి పొడి) - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ - 1 టీస్పూన్
కొత్తిమీర - సన్నగా తరిగినది
ఉప్పు - రుచికి సరిపడా
బజ్జీ మిరపకాయలు (లావుగా ఉండేవి)- 8
శనగ పిండి - 2 కప్పులు
వాము - అర టీస్పూన్
వంట సోడా - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో ఉడికించి, మెత్తగా చేసిన బంగాళాదుంప మిశ్రమాన్ని తీసుకోండి. అందులో సోంపు, ధనియాల పొడి, కారం, ఆమ్చూర్, గరం మసాలా, అల్లం పేస్ట్, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
-లావుగా ఉండే మిరపకాయలను కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. వాటిని మధ్యలోకి నిలువుగా గాటు పెట్టి, లోపల ఉన్న గింజలను తీసివేయాలి.
-ఇప్పుడు సిద్ధం చేసుకున్న బంగాళాదుంప మసాలాను మిరపకాయల లోపల నిండుగా కూరాలి. మిరపకాయ లోపలే కాకుండా, మిరపకాయ బయట కూడా కొంచెం బంగాళాదుంప మిశ్రమాన్ని అంటించాలి. దీనివల్ల వడ లావుగా, రుచిగా వస్తుంది.
-ఒక గిన్నెలో శనగ పిండి, ఉప్పు, వాము, చిటికెడు పసుపు వేసి కలపాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మరీ జారుగా కాకుండా, దోశ పిండి కంటే కొంచెం గట్టిగా బజ్జీ పిండిలా కలుపుకోవాలి.
-స్టవ్ వెలిగించి కడాయిలో నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత మంటను మీడియంలో పెట్టండి. మసాలా దట్టించిన మిరపకాయను శనగపిండి మిశ్రమంలో ముంచి, నూనెలో జాగ్రత్తగా విడవాలి.
-అన్ని వైపులా బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి తీసేయాలి. అంతే మిర్చి వడ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications