Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఇడ్లీ, దోసెలే కాదు.. వేడి అన్నంలోకి అదిరిపోయే ఆంధ్రా పచ్చిమిర్చి చట్నీ..
పొద్దున్నే లేవగానే వేడి వేడి ఇడ్లీలు, కరకరలాడే దోసెలు ప్లేట్ లోకి రాగానే పక్కన ఏం చట్నీ ఉందా అని చూస్తాం. కానీ రోజువారీగా చేసుకునే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీలే మళ్లీ మళ్లీ తింటే ఎవరికైనా విసుగు రావడం సహజం. మీ నాలుక కొత్త రుచిని కోరుకుంటోందా? అయితే ఆంధ్రా స్టైల్ పచ్చిమిర్చి పచ్చడి ట్రై చేయండి.
దీనిని ఒక్కసారి రుచి చూశారంటే, ఇకపై ఇడ్లీ, దోసెలే కాదు, వేడి వేడి అన్నంలోకి కూడా ఇదే కావాలంటారు. ఈ చట్నీని ఒక్కసారి చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే దాదాపు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అంటే ఉదయం హడావిడిలో చట్నీ చేసే పని తప్పుతుందన్నమాట. మరి ఇంత రుచికరమైన, సులభమైన పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పచ్చిమిర్చి: 100 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు: 10
వేరుశెనగ గుళ్లు (పల్లీలు): 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: 1 టీస్పూన్
పసుపు: చిటికెడు
నిమ్మరసం: 1 టీస్పూన్
నూనె: వేయించడానికి సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడగాలి. కడిగిన మిరపకాయలను పొడి గుడ్డతో తుడిచి కాసేపు ఆరనివ్వండి. తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి
-తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేయండి. నూనె వేడెక్కాక, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను వేసి, మంటను మీడియంలో ఉంచి వేయించాలి.
-మిరపకాయలు మెత్తబడి, రంగు మారి, వాటి ఘాటు వాసన పోయేంత వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో మిగిలిన నూనెలో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. చివరగా చిటికెడు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసి, వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు మరొక చిన్న బాండీలో లేదా అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్లను వేసి, బంగారు రంగు వచ్చేవరకు దోరగా వేయించుకుని చల్లార్చుకోవాలి. ఈ పల్లీలు పచ్చడికి మంచి చిక్కదనాన్ని, రుచిని ఇస్తాయి.
-ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి-జీలకర్ర మిశ్రమం, వేయించిన పల్లీలు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఈ మిశ్రమంలో 1 టీస్పూన్ నిమ్మరసం కలపండి.
-ఇది పచ్చడికి మంచి పులుపును ఇవ్వడమే కాకుండా నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. వీటన్నింటినీ మరీ మెత్తగా కాకుండా, కొంచెం బరకగా ఉండేలా రుబ్బుకోవాలి.
-సిద్ధమైన పచ్చడిని తడి లేని గాజు సీసాలో తీసుకోండి. దీనిని ఫ్రిజ్‌లో ఉంచితే దాదాపు నెల రోజుల పాటు తాజాగానే ఉంటుంది.
-మీకు ఇష్టమైతే, చివరిగా ఆవాలు, మినపప్పు, కరివేపాకుతో తాలింపు పెట్టుకోవచ్చు. ఇది పచ్చడి రుచిని మరింత పెంచుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
