Latest Updates
-
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్?
తంజావూర్ స్పెషల్ రోజా పువ్వు చట్నీ..ఇడ్లీ, దోసెల్లోకి సూపర్ కాంబినేషన్!..ఎలా చేసుకోవాలంటే..
ఉదయాన్నే వేడి వేడి ఇడ్లీలు, కరకరలాడే దోసెలు ప్లేట్లలోకి రాగానే నోరూరుతుంది. కానీ వాటి పక్కన రోజూ చూసే అదే కొబ్బరి చట్నీ లేదా పల్లీల చట్నీ తిని తిని బోర్ కొడుతుందా? అయితే ఓసారి తమిళనాడులోని తంజావూర్ స్పెషల్ రోజూపువ్వు చట్నీ ట్రై చేసి చూడండి..అదిరిపోతుంది. దీని పేరు వినగానే ఇందులో గులాబీ రేకులు వేస్తారేమో అని కంగారు పడకండి.
ఈ చట్నీకి ఆ పేరు అది తయారయ్యాక కనిపించే అద్భుతమైన రోజూపువ్వు(లేత ఎరుపు) వల్ల వచ్చింది. చూపులకు ఆకర్షణీయంగా, నోటికి కమ్మగా తగిలే ఈ చట్నీని తయారు చేయడం చాలా సులభం. ముఖ్యంగా ఈ చట్నీకి ఒక్కసారి చేసి పెట్టుకుంటే కనీసం నాలుగు రోజుల పాటు అస్సలు పాడవదు. తంజావూర్ రోజా పువ్వు మిరపకాయ చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తంజావూర్ రోజా పువ్వు చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
సాంబార్ ఉల్లిపాయలు: 10
ఎండు మిరపకాయలు: 5
కాశ్మీరీ ఎండు మిరపకాయలు: 4
చింతపండు: కొద్దిగా
చిన్న టమాటో: 1
ఉప్పు: తగినంత
ఆవాలు: 1 టీస్పూన్
మినప పప్పు: 1 టీస్పూన్
నువ్వుల నూనె: 3 టేబుల్ స్పూన్లు
కరివేపాకు: ఒక రెమ్మ
తంజావూర్ రోజా పువ్వు చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక పొట్టు తీసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలను వేసి దోరగా వేయించండి.
-ఉల్లిపాయలు సగం వేగి, ఉడికిన తర్వాత మాత్రమే అందులో సాధారణ ఎండుమిర్చి, కాశ్మీరీ ఎండుమిర్చి వేయాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలు మాడిపోకుండా ఉండి, చట్నీకి ఆకర్షణీయమైన ఎరుపు లేదా గులాబీ రంగు వస్తుంది.
-ఇప్పుడు అందులో తరిగిన టమాటో ముక్కలు, కొద్దిగా చింతపండు వేసి బాగా కలపండి. టమాటో ముక్కలు బాగా మెత్తబడి గుజ్జులా మారేంత వరకు సన్నని మంటపై వేయించాలి. తర్వాత స్టవ్ ఆపేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
-చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి, దానికి తగినంత ఉప్పు జోడించి బరకగా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద బాండీలో 3 చెంచాల నువ్వుల నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, మినపపప్పు వేసి చిటపటలాడనివ్వండి. చివరగా కరివేపాకు వేసి వేయించండి.
-ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని ఈ తాలింపులో వేసి బాగా కలపండి. సన్నని మంటపై సుమారు 5 నిమిషాల పాటు నూనె పైకి తేలేవరకు ఉడకనివ్వండి. చట్నీ కాస్త చిక్కబడి, మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేయండి.
-అంతే కంటికి ఇంపుగా, నోటికి కమ్మగా ఉండే తంజావూర్ గులాబీ చట్నీ రెడీ. వేడి వేడి నెయ్యి ఇడ్లీలతో కానీ, పేపర్ లాంటి క్రిస్పీ దోసెలతో కానీ ఈ చట్నీని వడ్డిస్తే లొట్టలేసుకుంటూ తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
