Latest Updates
-
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు!
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి!
సాధారణంగా ఇంట్లో కోడిగుడ్డుతో ఎప్పుడూ ఒకేలాంటి పులుసు, ఇగురు లేదా ఫ్రై చేసుకుని తిని బోర్ కొట్టిందా? అయితే ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి. ఇది అచ్చం రెస్టారెంట్లలో దొరికే పనీర్ బటర్ మసాలా రుచిని తలపిస్తుంది.వేడి వేడి చపాతీ, పూరీ, పరోటా, దోశ మాత్రమే కాదు, బగారా రైస్ లేదా వైట్ రైస్ లోకి కూడా అద్భుతంగా ఉంటుంది.

ఎగ్ బటర్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు
ఉడికించిన గుడ్లు - 4
వెన్న (బటర్) - 2 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
టమోటా ముక్కలు - 1 కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 4
అల్లం - అర అంగుళం ముక్క
జీడిపప్పు - 10 పలుకులు
కారం - 1 టేబుల్ స్పూన్
పసుపు - అర టేబుల్ స్పూన్
లవంగాలు - 2
యాలకులు - 2
దాల్చినచెక్క - 1 అంగుళం ముక్క
గరం మసాలా - అర టేబుల్ స్పూన్
ధనియాల పొడి - అర టేబుల్ స్పూన్
కసూరి మెంతి - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత

-ముందుగా కోడిగుడ్లను నీటిలో బాగా ఉడకబెట్టి, పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఆ గుడ్లకు ఫోర్క్ తో లేదా చాకుతో చిన్నగా గాట్లు పెట్టండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వెన్న వేయండి. వెన్న కరిగాక, ఉడికించిన గుడ్లను వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన గుడ్లను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో (అవసరమైతే కొద్దిగా నూనె లేదా వెన్న వేసి) తరిగిన ఉల్లిపాయలు, జీడిపప్పులు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, టమోటా ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మీడియం మంటపై వేయించండి. టమోటాలు పూర్తిగా మెత్తబడే వరకు మగ్గనివ్వండి.
-టమోటాలు ఉడికిన తర్వాత అందులో కారం, పసుపు వేసి బాగా కలపండి. పచ్చి వాసన పోయే వరకు వేయించి స్టవ్ ఆపేయండి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, మిక్సీ జార్ లో వేసి, అర కప్పు నీళ్లు పోసి మెత్తని క్రీమీ పేస్ట్ లా రుబ్బుకోండి.
-ఇప్పుడు మళ్లీ స్టవ్ మీద పాన్ పెట్టి మిగిలిన ఒక చెంచా వెన్న వేడి చేయండి. అందులో దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు వేసి వేయించండి. మసాలా దినుసుల సువాసన రాగానే ముందుగా మిక్సీ పట్టుకున్న గ్రేవీ పేస్ట్ ను పాన్ లో వేయండి. గ్రేవీకి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోండి.
-గ్రేవీ కొద్దిగా చిక్కబడుతున్న సమయంలో ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపండి. గ్రేవీ నుండి నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వండి.
-గ్రేవీ పర్ఫెక్ట్ గా ఉడికిన తర్వాత, ముందుగా వెన్నలో వేయించి పెట్టుకున్న గుడ్లను ఇందులో వేసి గ్రేవీ అంతా గుడ్లకు పట్టేలా కలపండి. చివరగా, మంచి సువాసన కోసం అరచేతిలో నలిపిన కసూరి మెంతిని కూరపై చల్లండి. మూత పెట్టి సన్నని మంటపై మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆపేయండి.
-అంతే ఎగ్ బటర్ మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications