Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు..
సాయంత్రం వేళ ఏదైనా వేడిగా, స్పైసీగా, కొత్తగా తినాలనిపిస్తుందా? రోజూ వేసుకునే రొటీన్ ఆమ్లెట్ తిని మీకు బోర్ కొట్టిందా? అయితే మీ రుచి మొగ్గలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే స్పైసీ చిల్లీ ఆమ్లెట్ ట్రై చేయండి. దీన్ని సాధారణ పెనం మీద కాకుండా గుంత పొంగనాల పాన్ లో చేస్తాం. చైనీస్ ఫ్లేవర్స్ తో కలిసి నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ చిల్లీ ఆమ్లెట్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

చిల్లీ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
కోడిగుడ్లు - 3
అల్లం - బొటనవేలు సైజు
వెల్లుల్లి రెబ్బలు - 3
పచ్చిమిర్చి - 1
ఉల్లికాడలు (స్ప్రింగ్ ఆనియన్స్) - 2 కొమ్మలు
ఉల్లిపాయ- 1 చిన్నది
నూనె - 3 టీస్పూన్లు
కుక్డ్ చిల్లీ పేస్ట్ - 1 టీస్పూన్
డార్క్ సోయా సాస్ - అర టీస్పూన్
టొమాటో సాస్ - 1 టీస్పూన్
ఉప్పు, మిరియాల పొడి - రుచికి సరిపడా
చక్కెర - చిటికెడు
చిల్లీ ఆమ్లెట్ తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో మూడు కోడిగుడ్లను పగలగొట్టి వేయండి. ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉల్లికాడల తరుగు వేయాలి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి ఒక ఫోర్క్ తో గానీ, బీటర్ తో గానీ గుడ్డు మిశ్రమాన్ని బాగా గిలక్కొట్టాలి. ఎంత బాగా కలిపితే ఆమ్లెట్ అంత ప్లఫ్ఫీగా వస్తుంది.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, గుంత పొంగనాల పెనం పెట్టుకోండి. పెనం వేడెక్కాక ప్రతి గుంతలో కొద్దిగా నూనె వేయండి. నూనె వేడెక్కాక ముందుగా సిద్ధం చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని ఒక్కో గుంతలో సగానికి పైగా పోయాలి. మంటను మీడియంలో పెట్టి, పైన మూత ఉంచండి. ఒ
-ఒకవైపు ఉడికిన తర్వాత, స్పూన్ తో నెమ్మదిగా రెండో వైపుకు తిప్పాలి. రెండు వైపులా ఎర్రగా, దోరగా ఉడికేవరకు ఉంచి ఆ తర్వాత వాటిని ఒక బౌల్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కొద్దిగా నూనె వేయండి. నూనె వేడెక్కగానే సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించండి. అవి వేగాక కుక్డ్ చిల్లీ పేస్ట్, టొమాటో సాస్ వేసి కలపండి. సాస్ మాడకుండా వెంటనే ఒక అర కప్పు నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు ఇందులో డార్క్ సోయా సాస్, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, సాస్ రుచిని బ్యాలెన్స్ చేయడానికి చిటికెడు చక్కెర వేసి బాగా మరిగించండి.
-సాస్ కాస్త చిక్కబడి, మంచి సువాసన వస్తున్న సమయంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్డు పొంగనాలను (ఆమ్లెట్లను) ఈ సాస్ లో వేయండి. సాస్ అంతా గుడ్డు ముక్కలకు బాగా పట్టేలా నిదానంగా టాస్ చేయండి. చివరగా పైన సన్నగా తరిగిన ఉల్లికాడలను (స్ప్రింగ్ ఆనియన్స్) చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-అంతే ఎంతో నోరూరించే వేడి వేడి చిల్లీ ఆమ్లెట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
