Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి
వేసవి కాలం వచ్చేసింది.. ఎండల దెబ్బకు నోటికి ఏదీ రుచించదు. కానీ కడుపునిండా కాస్త అన్నం తినాలంటే మాత్రం వేడి వేడి అన్నంలోకి ఏదైనా కమ్మటి రసం లేదా చారు ఉంటే బాగుంటుంది. సాధారణంగా ఈ కాలంలో మెజారిటీ ఇళ్లలో అమ్మలు టమాటా రసం, పచ్చిపులుసు, లేదా చింతపండు చారు చేస్తుంటారు. అయితే రోజూ అవే రొటీన్ రుచులు తింటే ఎవరికైనా బోర్ కొట్టేస్తుంది. అందుకే ఈ సమ్మర్ లో మార్కెట్లో విరివిగా దొరికే మునక్కాయలతో ఒక అదిరిపోయే స్పెషల్ రసం ట్రై చేయండి. ఇతర రసం రెసిపీలతో పోలిస్తే ఇది వంద రెట్లు అద్భుతంగా ఉంటుంది.

మునక్కాడ రసం తయారీకి కావాల్సిన పదార్థాలు
కందిపప్పు - 1 టేబుల్ స్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
మిరియాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ఎండుమిర్చి - 4
వెల్లుల్లి రెబ్బలు - 5
కరివేపాకు - 2 రెమ్మలు
రసం తయారీ కోసం:
లేత మునక్కాడలు - 2
టమాటాలు - 2 (మీడియం సైజ్ వి)
చింతపండు - చిన్న ఉసిరికాయంత
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
కరివేపాకు - 3 రెమ్మలు
ఇంగువ - పావు టీస్పూన్
ఎండుమిర్చి - 2
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - తగినంత
బెల్లం - అర టీస్పూన్
కొత్తిమీర తరుగు - కొద్దిగా
మునక్కాడ రసం తయారీ విధానం
-ముందుగా మునక్కాడలను కడిగి, పైన ఉండే సన్నని పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలను కూడా కోసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో మునక్కాడ ముక్కలు, టమాటా ముక్కలు, చింతపండు వేసి రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. మూతపెట్టి లో మీడియం మంట మీద 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
-కుక్కర్ ఆవిరి పోయేలోపు.. మిక్సీ జార్ లో కందిపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి వల్లే రసానికి కమ్మటి వాసన వస్తుంది.
-కుక్కర్ ఆవిరి పోయాక మూత తీసి స్మాషర్ లేదా పప్పుగుత్తితో ఆ మిశ్రమాన్ని మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత ఒక జల్లెడ తీసుకుని ఆ రసాన్ని ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని నూనె వేడిచేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి చిటపటలాడించాలి. ఆపై ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి.
-తాలింపు వేగాక, వడకట్టి పెట్టుకున్న మునక్కాడ రసాన్ని పోయాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, చిన్న బెల్లం ముక్క, అలాగే ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పొడి వేసి బాగా కలపాలి. మీడియం మంట మీద పది నిమిషాల పాటు రసాన్ని బాగా మరిగించాలి. రసం మరుగుతున్నప్పుడు ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని దించేసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మునక్కాడ రసం రెడీ. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఈ రసం కలుపుకుని తింటుంటే అమృతంలా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications