Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
పిండి నానబెట్టే శ్రమ లేదు..రుచితోపాటు ఆరోగ్యం అందించే ఓట్స్ మసాలా ఇడ్లీ..15 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అదే ఇడ్లీ, దోశ తిని విసుగొచ్చిందా? అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఒక అద్భుతమైన వంటకం ఓట్స్ మసాలా ఇడ్లీ. పప్పు నానబెట్టడం, పిండి రుబ్బడం వంటి శ్రమ లేకుండా కేవలం 15 నిమిషాల్లో ఓట్స్ మసాలా ఇడ్లీ రెడీ చేసుకోవచ్చు. ఇది కేవలం రుచికరమైనదే కాదు, బరువు తగ్గాలనుకునేవారికి, ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి ఒక వరం లాంటిది. ఓట్స్ మసాలా ఇడ్లీ తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-ఓట్స్ - 1 కప్పు
-బొంబాయి రవ్వ వేయించింది - అర కప్పు
-పుల్లటి పెరుగు - అర కప్పు
-తురిమిన క్యారెట్ - 2 టేబుల్ స్పూన్లు
-తురిమిన అల్లం - అర అంగుళం ముక్క
-తాలింపు కోసం: నూనె, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, చిటికెడు ఇంగువ,
కరివేపాకు
-వంటసోడా - అర టీస్పూన్
-ఉప్పు - రుచికి సరిపడా
-నీరు - తగినంత

తయారీ విధానం
-ముందుగా ఓట్స్ ను మిక్సీ జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలా ఉండేలా పొడి చేసుకోవాలి.
-ఒక గిన్నెలో ఈ ఓట్స్ పొడి, వేయించిన బొంబాయి రవ్వ,పుల్లటి పెరుగు, తురిమిన క్యారెట్, అల్లం వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా ఇడ్లీ పిండిలా జారుగా కలుపుకోవాలి.
-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కొద్దిగా నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, కరివేపాకు వేసి చిటపటలాడించాలి. ఈ ఘుమఘుమలాడే తాలింపును పిండిలో వేసి బాగా కలపాలి.
-ఈ మిశ్రమాన్ని మూతపెట్టి ఓ 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దీనివల్ల రవ్వ, ఓట్స్ చక్కగా నాని ఇడ్లీలు మెత్తగా వస్తాయి.
-చివరగా ఇడ్లీలు పెట్టే ముందు రుచికి సరిపడా ఉప్పు, వంటసోడా వేసి పిండిని ఒకే దిశలో నున్నగా కలపాలి.
-తర్వాత ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి పిండిని వేసి 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికిస్తే చాలు. అంతే వేడివేడి, మెత్తటి, సువాసనభరితమైన ఓట్స్ మసాలా ఇడ్లీ రెడీ.
ఈ ఓట్స్ మసాలా ఇడ్లీని కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications