Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
వంకాయ,పెరుగుతో అద్భుతం..అన్నంలోకి, చపాతీలోకి పర్ ఫెక్ట్..ఎలా చేసుకోవాలంటే
వంకాయ పెరుగు తాలింపు..ఈ పేరు వినగానే చాలామందికి కొత్తగా అనిపించవచ్చు. సాధారణంగా వంకాయతో పులుసు, కూర, ఫ్రై, పచ్చడి వంటివి చేస్తుంటారు. కానీ వంకాయను పెరుగుతో కలిపి తాలింపు చేయడం అనేది కాస్త ఢిఫరెంట్ గా అనిపించినప్పటికీ దీని రుచి మాత్రం అనూహ్యంగా అద్భుతంగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, చివరికి ఉదయం టిఫిన్ లోకి కూడా సైడ్ డిష్ గా దీనిని తీసుకోవచ్చు. వంకాయ పెరుగు తాలింపు కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ వంటకంలో ఉపయోగించే ప్రధాన పదార్థాలైన వంకాయ, పెరుగు రెండూ పోషక విలువలు కలిగినవే. వంకాయ పెరుగు తాలింపు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
వంకాయ పెరుగు తాలింపు తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెరుగు
-ఉల్లిపాయ
-ధనియాల పొడి
-కరివేపాకు
-పచ్చిమిర్చి
-పసుపు
-ఉప్పు
-ఆయిల్
-వంకాయ
-తాళింపు గింజలు
-ఇంగువ
-ఎండుమిరపకాయలు
వంకాయ పెరుగు తాళింపు తయారీ విధానం
-ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకోండి. అందులో అ పెద్ద కప్పు పెరుగు, అరకప్పు నీళ్లు, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోండి.
-నాలుగు పెద్ద సైజు పొడవు వంకాయలను కడిగి రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కలను ఉప్పు వేసి కలిపిన నీళ్లలో వేయండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడి చేసి కట్ చేసిన వంకాయ ముక్కలను నీళ్లు లేకుండా వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
-వంకాయ ముక్కలు సగంపైగా వేగిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, రెండు రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిర్చి పొడవాటి చీలికలు, కొంచెం పసుపు వేసి మరో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి.
-పచ్చిమిర్చి,కరివేపాకు కూడా వేగిన తర్వాత అందులో 1 టీస్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
-వంకాయ ముక్కలు చల్లారిన తర్వాత ఆ మొత్తాన్ని పెరుగులో వేసి కలుపుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసి 1 టీస్పూన్ తాళింపు గింజలు, 2 ఎండుమిరపకాయల ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
-తాళింపు వేగిన తర్వాత అందులో పావు టీస్పూన్, పావు టీస్పూన్ ఇంగువ వేసి కలిపి ఈ తాళింపుని పెరుగులో వేసి కలుపుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







