Latest Updates
-
సీతారాముల కళ్యాణానికి ముహూర్తం పెట్టిన ప్లేస్ ఇదే..శ్రీరామనవమికి అక్కడ అందుకే అంత స్పెషల్! -
శ్రీరామనవమి స్పెషల్..గోధుమ రవ్వ పాయసం ఇలా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
క్లాస్ రూమ్ లోని విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్..చెప్పుతో చితకబాదిన స్టూడెంట్..వీడియో చూడండి -
ఈరోజు రాశి ఫలాలు (27.03.26): శుక్రవారం నాడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ, దోసెల్లోకి బెస్ట్ కాంబినేషన్: నోరూరించే బెంగాలీ స్టైల్ టమాటా చట్నీ తయారీ ఇలా! -
శ్రీరామనవమి స్పెషల్.. కేవలం 5 నిమిషాల్లో రాముడికి ఇష్టమైన పంచామృతం..ఎలా చేసుకోవాలంటే.. -
టైమ్ లేదు, బడ్జెట్ లేదా? అయితే కొత్త జంటలకు మినీమూనే బెస్ట్ ఆప్షన్..కపుల్స్ లేటెస్ట్ ఛాయిస్ ఇదే! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. మన పూర్వీకుల స్పెషల్ బీరకాయ మజ్జిగ పులుసు..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
మండుటెండల్లో ప్రాణం లేచిరావాలా? ఈ సమ్మర్ లో బెల్లం కోల్డ్ కాఫీ ట్రై చేయండి! -
కూల్ డ్రింక్స్ వద్దు..ఆరోగ్యానికి అమృతమంటి పుదీనా మజ్జిగ..5 నిమిషాల్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
కేవలం 2 బంగాళదుంపలతో..10 నిమిషాల్లో పొటాటో పాప్ కార్న్..పైన కరకరలాడుతూ, లోపల కరిగిపోయేలా..
సాయంత్రం అవుతుందంటే చాలు..మనసు ఏదైనా వేడివేడిగా, కారంగా, కరకరలాడే స్నాక్స్ తినాలని ఆరాటపడుతూ ఉంటుంది. అయితే బేకరీల చుట్టూ తిరగడం లేదా బయట మార్కెట్లో దొరికే నూనె పదార్థాలు కొని తినడం వల్ల మన ఆరోగ్యానికి ముప్పు వాటిల్లడమే కాకుండా, జేబుకు కూడా బాగానే చిల్లు పడుతుంది.
ఇంట్లోనే అప్పటికప్పుడు, తక్కువ ఖర్చుతో, ఎంతో రుచికరంగా చేసుకోగలిగే స్నాక్ పొటాటో పాప్ కార్న్. కేవలం రెండు బంగాళదుంపలతో నిమిషాల్లో తయారు చేసుకోగలిగే పొటాటో పాప్ కార్న్ బయట వైపు అత్యంత కరకరలాడుతూ, లోపల నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉంటుంది.
పొటాటో పాప్ కార్న్ తయారీకి కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు - 2 (బాగా ఉడికించినవి)
కార్న్‌ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) - 3 టేబుల్ స్పూన్లు
ఒరిగానో - అర టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ - అర టీస్పూన్
చాట్ మసాలా - ఒక టీస్పూన్
కారం పొడి - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
బ్రెడ్ క్రంబ్స్ (బ్రెడ్ పొడి) - కోటింగ్ కోసం తగినంత
వంట నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
పొటాటో పాప్ కార్న్ తయారీ విధానం
-ముందుగా రెండు మధ్యస్థ పరిమాణంలో ఉన్న బంగాళాదుంపలను తీసుకుని శుభ్రంగా కడిగి, కుక్కర్లో మెత్తగా ఉడికించండి. చల్లారిన తర్వాత వాటి తొక్క తీసి పక్కన పెట్టుకోండి.
-ఉడికించిన బంగాళదుంపలను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, ఎక్కడా ఉండలు లేకుండా చాలా మెత్తగా మ్యాష్ చేసుకోండి (ముద్దలా చేయండి).
-ఇప్పుడు ఆ బంగాళదుంప ముద్దలో 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, అర టీస్పూన్ ఒరేగానో, అర టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్, మరియు మీ రుచికి తగినంత ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా చేత్తో కలుపుకోండి. పిండి ముద్దలా తయారవుతుంది.
-ఇప్పుడు స్టవ్ ఒక మందపాటి కడాయిని పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడెక్కనివ్వండి.
-నూనె వేడెక్కేలోపు, మీరు తయారు చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న చిన్న గోళీల్లా గుండ్రంగా చుట్టుకోండి. వీటిని బ్రెడ్ క్రంబ్స్ (బ్రెడ్ పొడి) ఉన్న ప్లేట్ లో వేసి, ఆ పొడి బాల్స్ కు అన్ని వైపులా బాగా పట్టేలా కోటింగ్ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల పాప్‌కార్న్ మరింత కరకరలాడుతుంది.
-నూనె వేడెక్కిన తర్వాత రెడీ చేసుకున్న బాల్స్ ను నూనెలో వేసి బంగారు గోధుమ రంగులోకి మారి, కరకరలాడే వరకు వేయించి మీడియం మంట మీద వేయించాక ఒక ప్లేట్ లోకి తీసుకోండి.
-ఫ్రై చేసుకున్న వేడివేడి పాప్ కార్న్ ను ఒక పెద్ద గిన్నెలో వేసి, వాటి పైన ఒక టీస్పూన్ చాట్ మసాలా, కొద్దిగా కారం పొడి చల్లండి. గిన్నెను పైకి కిందికి కదుపుతూ మసాలా అంతా ఆ బాల్స్ కు పట్టేలా బాగా కలపండి.
-అంతే బంగాళాదుంప పాప్ కార్న్ రెడీ. వీటిని టొమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో నంజుకుని తింటే ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








