Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఆరోగ్యం + రుచి..ఎముకల బలహీనతకు చెక్ పెట్టే మఖానా హల్వా..తయారీ చాలా ఈజీ
మన ఆరోగ్యానికి బోలెడంత మేలు చేసే ఆహారాల్లో మఖానా ఒకటి. బీహార్, యూపీ ప్రాంతాల్లోనే దీని సాగు ఎక్కువగా ఉంటుంది. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా రోజూ మఖానా తింటారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రధాని మోదీ మఖానా గురించి చెప్పిన తర్వాత చాలామంది దానిని తినడం ప్రారంభించారు.
సాధారణంగా మనం మఖానాలను నెయ్యిలో వేయించుకుని స్నాక్ గా తింటాం లేదా ఖీర్ చేసుకుంటాం. కానీ ఎప్పుడైనా మఖానా హల్వా రుచి చూశారా? ఇది చాలా అరుదైన, అద్భుతమైన వంటకం. ముఖ్యంగా ఎముకల బలహీనత ఉన్నవారికి, పిల్లలకు, ఉపవాస సమయంలో తక్షణ శక్తిని కోరుకునే వారికి ఇది దివ్యౌషధం లాంటిది. ఇది నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత మృదువుగా ఉంటూనే, అద్భుతమైన రుచిని అందిస్తుంది. కేవలం 15-20 నిమిషాల్లో మఖానా హల్వా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
మఖానా: 2 కప్పులు (50-60 గ్రాములు)
చిక్కటి ఫుల్ క్రీమ్ పాలు: 2 కప్పులు
చక్కెర: అర కప్పు
నెయ్యి: 3-4 టేబుల్ స్పూన్లు
ఏలకుల పొడి: అర టీస్పూన్
డ్రై ఫ్రూట్స్: 2 టేబుల్ స్పూన్లు (బాదం, జీడిపప్పు, పిస్తా
తరుగు)
కుంకుమపువ్వు: చిటికెడు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, మందపాటి అడుగు ఉన్న పాన్ పెట్టుకోండి. అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక మఖానాలను వేయండి. మీడియం మంట మీద మఖానాలు కరకరలాడేలా అయ్యే వరకు వేయించుకోవాలి.
-వేయించిన తర్వాత మఖానాలను ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వండి.
-చల్లారిన మఖానాలను మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేయాలి. మఖానాలను మరీ మెత్తని పిండిలా కాకుండా, కొంచెం బరకగా ఉండేలా చేసుకోవాలి. దీనివల్ల హల్వా ఆకృతి చాలా బాగుంటుంది.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో మరికొంత నెయ్యి వేసి తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తాలను వేసి దోరగా, బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోండి.
-మిగిలిన నెయ్యిలో సిద్ధం చేసుకున్న మఖానా పొడిని వేసి తక్కువ మంటపై 1-2 నిమిషాల పాటు వేయించాలి. ఇలా చేయడం వల్ల మఖానాలోని పచ్చి వాసన పోయి, కమ్మని నెయ్యి వాసన వస్తుంది.
-ఇప్పుడు పాన్ లో పాలను నెమ్మదిగా పోస్తూ మరో చేత్తో మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. మఖానా పొడి పాలను త్వరగా పీల్చుకుంటుంది కాబట్టి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి.
-మిశ్రమం చిక్కబడి పాన్ నుండి వేరుపడుతున్నప్పుడు అందులో చక్కెర,ఏలకుల పొడి, నానబెట్టిన కుంకుమపువ్వు పాలను వేయండి. చక్కెర పూర్తిగా కరిగి, హల్వా దగ్గర పడే వరకు బాగా కలుపుతూ ఉండాలి.
-చివరగా పాన్ లో నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపండి. హల్వా నుండి నెయ్యి బయటకు రావడం ప్రారంభించినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మఖానా హల్వా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







