Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.!
ఇండిపెండెన్స్ డే అందరూ ఇంట్లోనే ఉంటారు. ఈ సందర్భాన్ని మీరు మరింత గ్రాండ్‌గా, ప్రత్యేకంగా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలంటే ముందుగా నోరూరించే వంటకాలు ఉండాల్సిందే. అందులో స్వీట్స్ తప్పనిసరి. కానీ ఎక్కువ టైం పట్టే వంటల జోలికి వెళ్లాలని లేనప్పుడు ఇలా త్వరగా సింపుల్‌గా అయిపోయేలా ట్రై కలర్ మోదక్ చేసి చూడండి. నోట్లో వేస్తే కరిగిపోయేలా టేస్టే మోదక్ ఎలా చేయాలో చూద్దాం..

ట్రై కలర్ మోదక్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బెల్లం- అరకప్పు
తురిమిన పచ్చి కొబ్బరి- కప్పు
ఏలకుల పొడి- పావు టీస్పూన్
నీళ్లు- కప్పు
ఉప్పు- పావు టీ స్పూన్
నెయ్యి- టీస్పూన్
బియ్యం పిండి- కప్పు
ట్రై కలర్ మోదక్‌లో స్టఫ్ కోసం తయారీ విధానం..
ట్రై కలర్ మోదక్‌లో స్టఫ్ కోసం ముందుగా స్టవ్‌పైన పాన్ పెట్టుకుని అందులో బెల్లం, పచ్చికొబ్బరి వేసి కరిగేవరకు కలపండి. తర్వాత ఇందులో పావు టీస్పూన్ ఏలకుల పొడి వేసి చిక్కగా దగ్గరకు అయ్యే వరకు కలుపుకోవాలి.
స్వీట్ స్టఫ్ పూర్తయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి.

ట్రై కలర్ మోదక్ తయారీ విధానం
ఇప్పుడు మరో పాన్‌లో కప్పు నీళ్లు వేసి కాగనివ్వాలి. ఇందులో పావు టీస్పూన్ ఉప్పు, టీస్పూన్ నెయ్యి వేసి కలపాలి. అందులోనే కప్పు బియ్యం పిండి వేసి కలుపుకొని రెండు నిమిషాల పాటు స్టవ్‌పైన ఉంచాలి.
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.!
తడిపిన బియ్యం పిండిని వేరే బౌల్‌లోకి తీసుకుని సాఫ్ట్‌గా కలుపుకోండి. ఈ పిండి ముద్దను మూడు సమాన భాగాలుగా చేసుకోవాలి.
ఈ పిండి ముద్దల్లోని ఒక దాంట్లో గ్రీన్ ఫుడ్ కలర్, మరో దాంట్లో కాషాయ రంగు ఫుడ్ కలర్‌ను కలుపుకొని ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి. మరో పిండి ముద్ద తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి అలాగే ఉండనివ్వండి.
ఇప్పుడు మోదకాలు చేసే పరికరం(మోదక్ మౌల్డ్) తీసుకుని కొంచెం పిండి ముద్దను తీసుకుని అందులో లోపలి వైపు చుట్టూ అప్లై చేయాలి. లోపల బెల్లం, కొబ్బరి స్టఫ్‌ను కొద్దిగా అప్లై చేయాలి. ఇప్పుడు దీనిని మరికొంచెం పిండితో కవర్ చేయాలి.

మోదక్ మౌల్డ్‌ను గట్టిగా అదిమి ఓపెన్ చేసి మోదక్‌ను పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన ఇడ్లీ పాత్ర పెట్టుకుని కొన్ని నీళ్లు పోసి స్టీమర్ ప్లేట్ పెట్టుకోవాలి. ఈ ప్లేట్‌పై తయారుచేసుకున్న మోదక్‌లను ఒక్కొక్కటిగా విడివిడిగా పెట్టుకుని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు పెద్ద మంటపైన ఉడికించాలి.
మైదా పిండి అవసరమే లేదు.. ఇంట్లోనే జ్యూసీగా నోరూరించే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా.!
స్టవ్ ఆఫ్ చేశాక కాసేపటి తర్వాత మూత తీసి వీటిని వేరే ప్లేట్‌లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే టేస్టీ అండ్ ఈజీ మోదక్‌లు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
