Latest Updates
-
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.! -
చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ.. -
గుడ్లు,చికెన్ కంటే వీటిలోనే ఎక్కువ ప్రొటీన్,మినరల్స్..బరువు తగ్గాలన్నా,కండలు పెంచాలన్నా ఇవే బెస్ట్ -
ఇడ్లీ, దోసెలు కాదు పొద్దున్నే ఇది తినండి..100 ఏళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు! -
కాల సర్ప దోషంతో కష్టాలు.. నాగుల పంచమి రోజున ఈ ఐదు పనులు చేయండి.!
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి
ఈ ఏడాది 80వ స్వాతంత్ర్య దినోత్సవ (ఆగస్టు 15) వేడుకల కోసం దేశవ్యాప్తంగా అప్పుడే పండుగ వాతావరణం నెలకొంది. ఈ జాతీయ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఒకరికొకరు స్వీట్లు పంచుకోవడం మన భారతీయుల ఆనవాయితీ. ముఖ్యంగా ఇలాంటి పవిత్రమైన రోజున నోరు తీపి చేసుకోవడానికి అందరికీ ముందుగా గుర్తొచ్చేది అత్యంత ప్రజాదరణ పొందిన మోతీచూర్ లడ్డూ.
మార్కెట్లో లేదా స్వీట్ షాపుల్లో కొనే రసాయనాలతో కూడిన మిఠాయిలకు బదులుగా, స్వచ్ఛమైన నెయ్యితో మోతీచూర్ లడ్డూలను మన ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆ మధురానుభూతే వేరు. స్వీట్ షాపులో దొరికేంత అద్భుతమైన రుచితో, ఎంతో మృదువుగా ఉండే లడ్డూలను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మోతీచూర్ లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు
శనగపిండి - 2 కప్పులు
చక్కెర - 2 కప్పులు
నీళ్లు - తగినన్ని
యాలకుల పొడి - అర టీస్పూన్
ఆరెంజ్ ఫుడ్ కలర్ లేదా కుంకుమపువ్వు - 2 లేదా 3 చుక్కలు
పుచ్చకాయ గింజలు - 1 టేబుల్ స్పూన్
పిస్తా పప్పులు - 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి లేదా వంటనూనె - డీప్ ఫ్రై చేయడానికి
చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ..
మోతీచూర్ లడ్డు తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో శనగపిండిని ఎలాంటి ఉండలు లేకుండా జల్లించుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. పిండి మరీ చిక్కగా లేదా మరీ పలచగా కాకుండా, జారుడుగా ఉండేలా చూసుకోవాలి. మంచి రంగు కోసం అందులో ఒక చుక్క ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి బాగా గిలకొట్టాలి.
-తర్వాత స్టవ్ వెలిగించి మందంగా ఉన్న బాణలి పెట్టుకుని, డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యి లేదా నూనె పోసి మీడియం మంటపై వేడి చేయాలి. నూనె వేడెక్కాక, సన్నని రంధ్రాలున్న జల్లెడ గరిటెను నూనె పైన ఉంచి, అందులో శనగపిండి మిశ్రమాన్ని పోయాలి. అప్పుడు పిండి చిన్న చిన్న బూందీల్లా నూనెలో పడుతుంది. ఈ బూందీలను ఎర్రగా లేదా కరకరలాడేలా వేయించకూడదు. కేవలం 10 నుండి 15 సెకన్ల పాటు సాఫ్ట్ గా వేయించి వెంటనే జాలి గరిటెతో తీసి ఒక పళ్లెంలో పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు మరొక గిన్నెలో రెండు కప్పుల చక్కెర, ఒక కప్పు నీళ్లు పోసి మరగబెట్టాలి. ఇందులో మంచి సువాసన కోసం యాలకుల పొడి, మిగిలిన ఫుడ్ కలర్ వేసి కలపాలి. పంచదార పాకం తీగ పాకం రాకముందే, అనగా వేళ్లకు కాస్త జిగురుగా తగిలే సమయానికి స్టవ్ ఆపేయాలి.
-వేడిగా ఉన్న ఈ చక్కెర పాకంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బూందీని, పుచ్చకాయ గింజలను వేసి బాగా కలపాలి. బూందీ పాకాన్ని పూర్తిగా పీల్చుకునేలా మూతపెట్టి ఓ 20-30 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి.
-ఆ తర్వాత మిశ్రమం గోరువెచ్చగా అయినప్పుడు, మీ చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని గుండ్రటి లడ్డూల్లా చుట్టుకోవాలి. చివరగా వాటిపై సన్నగా తరిగిన పిస్తా ముక్కలతో అందంగా అలంకరించుకోవాలి.
-అంతే కమ్మని మోతీచూర్ లడ్డూలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications