Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
గ్యాస్, అసిడిటీకి చెక్..పప్పు వండే అసలైన సీక్రెట్ రివీల్ చేసిన ప్రముఖ చెఫ్
భారతీయుల భోజనంలో పప్పుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని పప్పు కలుపుకుని తింటే ఆ మజాయే వేరు. అలాగే రోటీ, చపాతీల్లోకి కూడా పప్పు అద్భుతమైన కాంబినేషన్. శాకాహారులకైతే పప్పుధాన్యాలు ప్రోటీన్ల గని లాంటివి. మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను, విటమిన్లను ఇవి పుష్కలంగా అందిస్తాయి.
అయితే మనం వండే పప్పును నిజంగా సరైన పద్ధతిలోనే వండుతున్నామా? ఈ ప్రశ్న అడిగితే చాలామంది అవును'అనే చెబుతారు. కానీ ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా మాత్రం మనం పప్పు వండే విధానంలో ఒక పెద్ద తప్పు చేస్తున్నామని చెబుతున్నారు. మనలో చాలా మంది పప్పును తప్పుగా వండటం వల్లే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తున్నాయని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ వీడియో ద్వారా తెలిపారు.

మనం చేసే సాధారణ తప్పు ఇదే
సాధారణంగా మన ఇళ్లలో పప్పును నీళ్లలో కడిగేసి, నేరుగా ప్రెషర్
కుక్కర్ లో వేస్తారు. అందులో సరిపడా నీళ్లు, పసుపు, ఉప్పు
వేసి మూతపెట్టి విజిల్స్ రానిస్తారు. కానీ ఇలా వండటం వల్ల పప్పులోని
పోషకాలు మన శరీరానికి పూర్తిగా అందవు.
పప్పును వండే సరైన విధానం
మొదటగా పప్పును శుభ్రమైన నీటిలో రెండు మూడు సార్లు బాగా కడగాలి. ఆ తర్వాత నేరుగా కుక్కర్ లో వేసి ఉడికించకూడదు.
1. కడిగిన పప్పులో మంచి నీళ్లు పోసి కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
2. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే... పప్పును నానబెట్టిన నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వంటకు వాడకూడదు, దానిని పారబోయాలి. ఎందుకంటే, పప్పు ధాన్యాలలో ఫైటిక్ యాసిడ్(Phytic acid) అనే యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలోని ఐరన్, జింక్, క్యాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. నానబెట్టిన నీటిని పారబోయడం వల్ల ఈ ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది.
3. ఇప్పుడు నానబెట్టిన పప్పును ప్రెషర్ కుక్కర్ లో వేసి, వంటకు సరిపడా కొత్త నీటిని పోయాలి. వెంటనే కుక్కర్ మూత పెట్టేయకూడదు. కుక్కర్ మూత తీసే ఉంచి, స్టవ్ ఆన్ చేసి కొన్ని నిమిషాల పాటు పప్పును ఉడకనివ్వాలి. పప్పు ఉడకడం ప్రారంభం కాగానే, నీటిపై ఒక తెల్లటి నురుగు లాంటి పొర ఏర్పడటం మీరు గమనిస్తారు. ఒక గరిటె తీసుకుని ఆ నురుగును పూర్తిగా తీసేసి పారబోయాలి. ఆ నురుగులో సాపోనిన్స్ (Saponins), ఇతర మలినాలు ఉంటాయి. వీటిని తొలగించకుండా పప్పును వండితే, అది త్వరగా జీర్ణం కాక కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది.
4.పప్పుపై వచ్చే నురుగును పూర్తిగా తొలగించిన తర్వాతే, అందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేయాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి, ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన పప్పుకు మీకిష్టమైన రీతిలో పోపు (తాలింపు) పెట్టుకుంటే సరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
