Latest Updates
-
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి!
నెలల తరబడి ఫ్రెష్ గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్..ఈ చిన్న ట్రిక్ తో ఇంట్లోనే చేసుకోండి
భారతీయ వంటగదుల్లో అల్లం, వెల్లుల్లిలది అగ్రస్థానం. ఈ రెండింటి సమ్మేళనంతో తయారైన అల్లం వెల్లుల్లి పేస్ట్ కేవలం వంటకాలకు రుచి, సువాసనను అందించడమే కాకుండా మన ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దీని ఘాటైన వాసన, కారంగా ఉండే రుచి.. కూరలు, బిర్యానీలు, మాంసాహార వంటకాలకు ప్రాణం పోస్తాయి.
బయట మార్కెట్లో రెడీమేడ్ పేస్ట్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఇంట్లో స్వచ్ఛంగా, తాజాగా తయారు చేసుకున్న పేస్ట్ రుచి, ఆరోగ్యం వేరు. ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లు వస్తున్నాయి. కొంతకాలం క్రితం హైదరాబాద్ లో ఒక ప్రాంతంలో అనేక కల్తీ పదార్థాలు ఉపయోగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద ఎత్తున తయారుచేసి షాపులకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. కాబట్టి ఎలాంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్ లు లేకుండా నెలల తరబడి నిల్వ చేసుకోగలిగిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-అల్లం
-వెల్లుల్లి
-కల్లు ఉప్పు
-పసుపు
-ఆయిల్
తయారీ విధానం
-ముందుగా 100 గ్రాముల అల్లం తీసుకొని ఓ ప్లేట్ లేదా గిన్నెలో వేసి నీళ్లు పోసి 4 నాలుగుసార్లు అయినా శుభ్రంగా కడగాలి. అస్సలు మట్టి అనేదే లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి.
-తర్వాత వాటిని పొడి క్లాత్ లేదా గుడ్డపై వేసి తడి పోయేటట్లు తుచుకోవాలి. ఇంకా తడి ఉంటే 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టి ఆరనివ్వాలి.
-తర్వాత అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-100గ్రాముల వెల్లుల్లిపాయలను కూడా తీసుకోండి(పొట్టుతోనే ఉంచాలా లేదా పొట్టు తీసేయాలా అనేది మీ ఇష్టం). అల్లం, వెల్లుల్లి రెండింటిలోనూ తేమ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో అల్లం,వెలుల్లి వేసి ఒకసారి గ్రైండ్ చేశాక ఇందులోనే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కల్లు ఉప్పు, 6 స్పూన్ల నూనె వేసి మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి.మెత్తని పేస్ట్ లా ఉండేలా గ్రైండ్ చెయ్యాలని గుర్తుంచుకోండి.
-ఇప్పుడు గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని గాజు సీసాలో పెట్టుకుని పేస్ట్ పైన ఒక టేబుల్ స్పూన్ నూనె వేయడం వల్ల గాలితో సంబంధం లేకుండా ఉండి, రంగు మారకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
-ఈ సీసాను మూత టైట్ గా బిగించేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కనీసం 2 నెలలు ప్రెష్ గా ఉంటుంది. వాడేటప్పుడు ఎప్పుడూ పొడి స్పూన్‌ను మాత్రమే ఉపయోగించాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







