Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
చెట్టినాడ్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ..చికెన్, మటన్ ని మరిపించే అద్భుతమైన రుచి!
బిర్యానీ అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది చికెన్ లేదా మటన్ బిర్యానీ. అసలైన బిర్యానీ అంటే కేవలం నాన్ వెజ్ మాత్రమేనని చాలామంది చెబుతుంటారు. కానీ అద్భుతమైన రుచి వెజ్ బిర్యానీలలో కూడా దాగి ఉందని మీకు తెలుసా? నాన్ వెజిటేరియన్స్ ని సైతం ఆశ్చర్యపరిచి, లొట్టలేసుకుంటూ తినేలా చేసే శక్తి పుట్టగొడుగుల (మష్రూమ్) సొంతం. పుట్టగొడుగులతో ఎన్ని రకాలు చేసినా వాటి రుచే వేరు. అయితే వీటన్నింటినీ మించిపోయే ఒక స్పెషల్ వంటకం చెట్టినాడ్ మష్రూమ్ బిర్యానీ.

చెట్టినాడ్ మష్రూమ్ బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం - 2 కప్పులు
పుట్టగొడుగులు- అర కేజీ
చిక్కటి కొబ్బరి పాలు - అర కప్పు
తాజా పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
పెద్ద ఉల్లిపాయ - 1
టమోటాలు - 2
పచ్చి మిరపకాయలు - 3
పసుపు పొడి - పావు టీస్పూన్
కారం పొడి - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
సోంపు పొడి - అర టీస్పూన్
దాల్చిన చెక్క- 2 ముక్కలు
యాలకులు - 3
లవంగాలు - 5
బిర్యానీ ఆకు - 1
నూనె, నెయ్యి - తగినంత
పుదీనా, కొత్తిమీర - గుప్పెడు చొప్పున
నీరు - 3 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా

చెట్టినాడ్ మష్రూమ్ బిర్యానీ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో బాస్మతి బియ్యాన్ని తీసుకుని, నీటితో రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినంత నీరు పోసి కనీసం అరగంట పాటు నానబెట్టుకోవాలి.
-బియ్యం నానుతున్న సమయంలో, పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి కావలసిన పరిమాణంలో ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె, రెండు చెంచాల కమ్మని నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగి వేడెక్కాక, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించండి.
-మసాలా దినుసుల సువాసన వస్తుండగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఆ తర్వాత నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి నూనెలో మగ్గనివ్వండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి.
-తర్వాత తరిగిన టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పుట్టగొడుగుల ముక్కలు వేసి బాగా కలపండి. దీంట్లోనే పసుపు, కారం, ధనియాల పొడి, సోంపు పొడి వేసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.
-మసాలాల పచ్చి వాసన పోయాక, అందులో చిక్కటి కొబ్బరి పాలు, పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలియబెట్టాలి. పుట్టగొడుగులు ఉడికేటప్పుడు వాటిలోని సహజమైన నీరు బయటకు వస్తుంది కాబట్టి, గ్రేవీ చక్కగా తయారవుతుంది. ఈ దశలో అదనంగా నీళ్లు పోయకూడదు.
-గ్రేవీ పర్ఫెక్ట్‌గా ఉడికిన తర్వాత, ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి మసాలా పట్టేలా నిదానంగా కలపండి. ఇప్పుడు సరిగ్గా 3 కప్పుల నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే నోరూరించే చెట్టినాడ్ మష్రూమ్ బిర్యానీ రెడీ. దీనిని చల్లని రైతాతో కలిపి వేడివేడిగా వడ్డిస్తే ఆహా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
