Latest Updates
-
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి చాలా హడావుడిగా ఉంటుంది. ఆఫీసులకి వెళ్లేవారు, స్కూల్స్, కాలేజ్‌లకు టిఫిన్స్‌లోకి కిచెన్‌లో చిన్న యుద్ధమే నడుస్తుంది. కొన్నిసార్లు తీరుబడిగా ఉన్నా, మరికొన్ని సార్లు ఉరుకులు పరుగులుగా ఉంటుంది. అలాంటి టైమ్‌లో హైరానా పడకుండా ఓవైపు లంచ్ ప్రిపేర్ చేస్తూనే మరోవైపు స్పీడ్‌గా హెల్తీ అండ్ టేస్టీగా ఈ టిఫిన్ చేసేయొచ్చు. అదే పుదీనా చట్నీ చీజ్ శాండ్విచ్.

టిఫిన్‌లో పొట్టకి చాలా లైట్‌గా ఉండటంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఉదయాన్నే పుదీనా తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడంతోపాటు రోజంతా యాక్టివ్‌గా ఉంటుంది. జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. పిల్లలు దీని టేస్ట్‌కి ఫిదా అయి లంచ్‌బాక్స్‌లోకి తీసుకెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చట్నీ చీజ్ శాండ్విచ్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. కేవలం పదే నిమిషాల్లో ఈ టిఫిన్‌ను ప్రిపేర్ చేసుకోవచ్చు.
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.!
చట్నీ చీజ్ శాండ్విచ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
పుదీనా ఆకులు- కప్పు
కొత్తిమీర- కప్పు
పచ్చికొబ్బరి తురుము- అరకప్పు
పచ్చిమిర్చి- రెండు
అల్లం- చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు- రెండు
వేయించిన శనగపప్పు- టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి- టీస్పూన్
ఉప్పు- అర టీస్పూన్
నల్ల ఉప్పు- అర టీస్పూన్
చాట్ మసాలా- అర టీస్పూన్
నిమ్మరసం- టీస్పూన్
వెన్న- సరిపడా
మోజ్రేళ్ల చీజ్- కప్పు
చీజ్ స్లైస్
చట్నీ చీజ్ శాండ్విచ్ కోసం ముందుగా మిక్సీ బౌల్లో శుభ్రంగా కడిగిన పుదీనా ఆకులు, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన శనగపప్పు, జీలకర్ర పొడి, ఉప్పు, నల్ల ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఇప్పుడు రెండు బ్రెడ్ ముక్కలను తీసుకుని వాటిపై కొద్దిగా బటర్ అప్లై చేసి ఈ చట్నీని రెండింటికీ ఒక్కో పైపు వెడల్పుగా అప్లై చేసుకోండి.

చట్నీ అప్లై చేసిన తర్వాత పైనుంచి చీజ్‌ను చల్లుకోండి. ఆ తర్వాత చీజ్ స్లైస్‌ను పరిచి దానిపై చట్నీ అప్లై చేసిన మరో బ్రెడ్ ముక్కతో మూసేయండి.
స్టవ్‌పైన పెనం పెట్టుకుని కొద్దిగా బటర్ అప్లై చేసి ఈ స్టఫ్డ్ బ్రెడ్ ముక్కలను రెండువైపులా చిన్న మంటపైన రోస్ట్ చేసుకోండి.
ఇలా మీకు కావాల్సినన్ని చేసుకుని తినేయడమే. హెల్తీ అండ్ టేస్టీ చట్నీ చీజ్ శాండ్విచ్ రెడీ. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి పొట్టకి చాలా లైట్‌గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
