మైసూర్ మటన్ పులావ్..టేస్ట్ కి సలాం కొట్టాల్సిందే!..ఈజీగా చేసుకోండిలా..

Posted By:

ఎప్పుడూ తినే రెగ్యులర్ దమ్ బిర్యానీలు తిని బోర్ కొట్టిందా? అయితే మీ నాలుకకు కొత్త రుచిని పరిచయం చేస్తూ, కాస్త భిన్నంగా, అత్యంత రుచికరంగా ఉండే మైసూర్ మటన్ పులావ్ ట్రై చేయండి. పచ్చటి మసాలాతో తయారయ్యే ఈ పులావ్ ఘుమఘుమలు మీ ఇల్లంతా వ్యాపించడమే కాకుండా, దీని అద్భుతమైన రుచి మీ కుటుంబ సభ్యులను ఫిదా చేస్తుంది. టేస్టీ మైసూర్ మటన్ పులావ్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Craving something new Try Mysore Mutton Pulao Recipe in Telugu

మైసూర్ మటన్ పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు

కొత్తిమీర - సగం కట్ట
పచ్చిమిర్చి - 10
అల్లం - 100 గ్రాములు
వెల్లుల్లి - 50 గ్రాములు
ఉప్పు - తగినంత
నూనె - కొద్దిగా
యాలకులు - 18
లవంగాలు - 15
దాల్చినచెక్క - 4 అంగుళాల ముక్క
ఉప్పు - కొద్దిగా
పసుపు - చిటికెడు
సోనా మసూరి బియ్యం - 2 కప్పులు
బాస్మతి బియ్యం - 1 కప్పు
మటన్ - 1 కిలో
నెయ్యి, నూనె - తగినంత
ఉల్లిపాయలు - 2 పెద్దవి
టమాటాలు - 2

మైసూర్ మటన్ పులావ్ తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టుకోవాలి. అందులో తగినంత నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తబడేలా మగ్గనివ్వాలి.

-ఈలోగా మిక్సీ గిన్నెలో యాలకలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఉప్పు, పసుపు వేసి మెత్తని పొడిలా చేసి పక్కన పెట్టుకోండి.

-స్టవ్ మీద గిన్నెలో టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కిలో మటన్ వేసి బాగా కలపాలి. ఇదులోనే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. మటన్ ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి సుమారు 40 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. కుక్కర్ అయితే మటన్ లేతదనాన్ని బట్టి 5-6 విజిల్స్ రానివ్వాలి.

-ఈలోగా మిక్సీ గిన్నెలో కొత్తిమీర,పచ్చిమిర్చి,అల్లం,వెల్లుల్లి,ఉప్పు, కొద్దిగా నూనె వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

-మటన్ బాగా ఉడికిన తర్వాత, అందులో మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా కాసేపు ఉడికించాలి.

-ఇప్పుడు బియ్యానికి సరిపడా నీళ్లు పోయాలి. రుచికి సరిపడా ఉప్పు సరిచూసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు గంటపాటు నానబెట్టుకున్న సోనా మసూరి, బాస్మతి బియ్యం మిశ్రమాన్ని అందులో వేసి నెమ్మదిగా కలపాలి.

-బియ్యం సగం ఉడికి, నీళ్లు దగ్గర పడుతున్న సమయంలో మంటను పూర్తిగా సిమ్ లో పెట్టాలి. గాలి బయటకు పోకుండా మూత గట్టిగా పెట్టి 20 నిమిషాల పాటు దమ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. వెంటనే మూత తీయకుండా, ఒక 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. అప్పుడే మసాలా ఫ్లేవర్స్ అన్నీ రైస్ కి పట్టి పులావ్ పొడిపొడిగా, అద్భుతంగా వస్తుంది.

-అంతే ఎంతో గుమగుమలాడే, నోరూరించే అచ్చమైన మైసూర్ మటన్ పులావ్ రెడీ. దీనిని ఉల్లిపాయ రైతాతో కలిపి వేడివేడిగా వడ్డిస్తే ఆ రుచికి ఎవరైనా సలామ్ కొట్టాల్సిందే.

[ of 5 - Users]
Story first published: Monday, May 18, 2026, 7:38 [IST]
Desktop Bottom Promotion