క్రీమీ, చీజీ కాలీఫ్లవర్ పాస్తా.. ఒకే పాత్రలో సులభంగా చేసుకోండిలా..

Posted By:

కాలీఫ్లవర్ తో రకరకాల వంటకాలు తయారుచేస్తుంటారు. కాలీఫ్లవర్ తో ఏం చేసినా ఫ్రై చేసినా, పులుసు చేసినా, మంచూరియా చేసినా ఏదైనా సరే టేస్ట్ అదిరిపోతుంది. అయితే మీరెప్పుడైనా కాలీఫ్లవర్ పాస్తా రుచి చూశారా? ఇది వన్ పాట్ రెసిపి..అంటే ఒక పాత్రలోనే మొత్తం వంటకం రెడీ అయిపోతుంది. క్రీమీగా, చీజీగా అప్పటికప్పుడు చాలా ఈజీగా దీనిని తయారుచేసుకోవచ్చు.

పిల్లల లంచ్ బాక్సులో పెట్టడానికి కూడా ఇది బాగుంటుంది. ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. క్రీమీ, చీజీ కాలిఫ్లవర్ పాస్తా మీ ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

creamy and cheesy cauliflower pasta one pot recipe in telugu

తయారీకి కావాల్సిన పదార్థాలు

-1 టేబుల్ స్పూన్ ఆయిల్
-1 ఉల్లిపాయ
-1 కప్పు నీళ్లలో ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు
-2 టమాటోలు
-10 జీడిపప్పులు
-1 టేబుల్ స్పూన్ బటర్
-1 టేబుల్ స్పూన్ ఆయిల్
-5 వెల్లుల్లి తరుగు
-1 టీస్పూన్ చిల్లీ ప్లేక్స్
-1 టీస్పూన్ ఒరేగానో
-1 టీస్పూన్ కశ్మీరీ కారం పొడి
-1 కప్పు పాస్తా
-ఒకటిన్నర కప్పుల నీళ్లు
-చీజ్ తురుము

ఫైబర్ ఎక్కువ, ఆయిల్ తక్కువ.. కడుపుకు హాయినిచ్చే చౌ చౌ క్యారెట్ కూటు..చపాతీ,పూరీల్లోకి కిర్రాక్ టేస్ట్

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసి అందులో ఉల్లిపాయలు, ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, టమాటో ముక్కలు, జీడిపప్పు వేసి వేయించాలి. వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.

-చల్లారిన తర్వాత మొత్తాన్ని మిక్సీ జార్ లో వేసి మొత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

-స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి అందులో వెన్న, నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి తరుగు వేపి మంచి సువాసన వచ్చేదాకా వేయించాలి.

-తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న కాలీఫ్లవర్ పేస్ట్, ఉప్పు, చిల్లీ ప్లేక్స్, ఒరేగావో, కశ్మీరీ కారం పొడి వేసి కలిపి 2-3 నిమిషాలు వేయించాలి.

-3 నిమిషాల తర్వాత అందులో పాస్తా వేసి,ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే మరికొంత నీళ్లు కలుపుకోవచ్చు. మూతపెట్టి 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.

-తర్వాత స్టవ్ ఆపేసి ప్రెజర్ పోయాక మూత తీసి బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో చీజ్ తురుమి వేసుకోండి, కొంచెం ఒరేగానో, చిల్లీ ప్లేక్స్ వేసి కలుపుకోండి.

-అంతే కాలీఫ్లవర్ పాస్తా రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, October 28, 2026, 14:45 [IST]
Desktop Bottom Promotion