Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
రెస్టారెంట్ స్టైల్ బ్రోకలీ సూప్ ఇంట్లోనే ఈజీగా.. తయారీ విధానం ఇదే
చలికాలంలో మన శరీరం వెచ్చదనాన్ని కోరుకుంటుంది. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది. అయితే కేవలం రుచి కోసమే కాకుండా, ఆరోగ్యాన్ని కాపాడుతూ, శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచే ఆహారాన్ని తీసుకోవడం ఈ సీజన్ లో చాలా ముఖ్యం. ఈ చలికాలంలో మిమ్మల్ని యాక్టివ్ గా, ఆరోగ్యంగా ఉంచే అద్భుతమైన రెసిపీనే బ్రోకలీ సూప్.
సాధారణంగా బ్రోకలీ పేరు చెబితేనే పిల్లలు ముక్కున వేలేసుకుంటారు. దాని రుచి పెద్దగా నచ్చక పక్కన పెట్టేస్తుంటారు. కానీ స్పెషల్ పద్ధతిలో బ్రోకలీ సూప్ చేశారంటే, పిల్లలు మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ తాగుతారు. రుచికరంగా ఉండే బ్రోకలీ సూప్ మీ ఇంట్లో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

బ్రోకలీ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బ్రోకలీ: 1
జీలకర్ర: 1 టీస్పూన్
నల్ల మిరియాల పొడి: 1-2 టీస్పూన్లు
ఫ్రెష్ క్రీమ్: 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
నూనె లేదా వెన్న: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
బ్రోకలీ సూప్ తయారీ విధానం
-ముందుగా బ్రోకలీని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కడగాలి. దీనివల్ల అందులో ఉండే చిన్న పురుగులు ఏవైనా ఉంటే పోతాయి.
-స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి, కడిగిన బ్రోకలీ ముక్కలను అందులో వేసి మరిగించాలి. బ్రోకలీ మరీ మెత్తగా కాకుండా, కొంచెం మెత్తబడే వరకు ఉడికించి, నీటి నుండి తీసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఒక టీస్పూన్ నూనె లేదా వెన్న వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో కచ్చాపచ్చాగా దంచిన జీలకర్ర, నల్ల మిరియాల పొడి వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి.
-పోపు వేగిన తర్వాత, ముందుగా ఉడికించి పెట్టుకున్న బ్రోకలీ ముక్కలను పాన్ లో వేసి దాదాపు 5 నిమిషాల పాటు సన్నని మంటపై వేయించాలి. ఆ తర్వాత అందులో 2 కప్పుల నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టాలి. బ్రోకలీ పూర్తిగా మెత్తగా ఉడికే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
-మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, గార్నిషింగ్ కోసం కొన్ని బ్రోకలీ ముక్కలను పక్కకు తీసి పెట్టుకోండి. మిగిలిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు ఈ సూప్ ను బౌల్ లోకి తీసుకుని, పక్కన పెట్టిన బ్రోకలీ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ తో అలంకరించాలి. చివరగా చిటికెడు మిరియాల పొడి చల్లుకోండి. అంతే బ్రోకలీ సూప్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications