Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా..3 రకాల పప్పులతో పప్పు చెక్కలు..ఎలా చేసుకోవాలంటే
పప్పు చెక్కలు తెలుగు వారి సాంప్రదాయ వంటకాల్లో ఒకటి. పండుగలప్పుడు, ప్రత్యేక సందర్భాలలో లేదా సాయంకాలం టీతో పాటు తినడానికి ఇవి పర్ఫెక్ట్ గా ఉంటాయి. కరకరలాడే స్వభావం, కమ్మటి రుచితో అందరినీ ఆకట్టుకుంటాయి. బియ్యం పిండి,పెసరపప్పు,మినపప్పు కలిపి తయారుచేసే చెక్కలు ఇంకా చాలా చాలా టేస్టీగా,క్రిస్పీగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో వాడే శెనగపప్పు, మసాలాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. కరకరలాడే పప్పు చెక్కలను మూడు రకాల పప్పులు ఉపయోగించి చాలా ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
పప్పు చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-పచ్చి శెనగపప్పు
-పెసరపప్పు
-మినపప్పు
-బియ్యం పిండి
-ఇంగువ
-కారం
-ఉప్పు
-పసుపు
-నెయ్యి లేదా వెన్న
-నువ్వులు
-కరివేపాకు
-ఆయిల్
-నీళ్లు

పప్పు చెక్కలు తయారీ విధానం
-ముందుగా కుక్కర్ అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి శెనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, 3 మినపప్పు వేసుకోండి. నీళ్లు పోసి పప్పులను శుభ్రంగా కడగాలి.
-తర్వాత పప్పులలో ఒకటి లేదా ఒకటిన్నర కప్పుల వరకు నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంట మీద 5 విజిల్స్ రానివ్వండి. పప్పు మెత్తగా ఉడకాలి.
-ఉడికిన పప్పులను కాస్త పలుకుగానే ఉండేట్లుగా మెదుపుకోండి.
-పలుకుగా మెదుపుకున్న పప్పుల మిశ్రమాన్ని ఓ బౌల్ లోకి తీసుకొని ఇందులో 2 కప్పుల పొడి బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ పచ్చి నువ్వులు, 3 రెమ్మల కరివేపాకు తరుగు, 1 టీస్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ ఇంగువ, ఒకటిన్నర టీస్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వెన్న లేదా నెయ్యి కూడా వేసి మొత్తం అన్నీ కలిసేలా చేత్తో బాగా కలుపుకోవాలి.
-తర్వాత అందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
-తర్వాత పిండిని చిన్న చిన్న బాల్స్ గా చేసి పిండి ఆరిపోకుండా బౌల్ మీద మూతపెట్టి ఉంచండి.
-తర్వాత ప్లాస్టిక్ కవర్ లేదా బటర్ పేపర్ మీద పిండి బాల్స్ ను కొంచెం దూరం దూరంగా పెట్టి పైన కవర్ కప్పి చదరంగా ఉండే ఓ గిన్నో లేదా గ్లాసునో ఒక్కో పిండి బాల్ మీద పెట్టి చెక్కలా ఒత్తుకోవాలి. మరీ మందంగా ఒత్తుకోవద్దు..మరీ పల్చగా ఒత్తుకోవద్దు.
-ఒత్తుకున్న చెక్కలకు ఫోర్క్ తో లేదా చాకుతో అక్కడక్కడా సన్నగా గాట్లుగా లేదా హోల్స్ లా పెట్టండి
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసి బాగా వేడి చేయాలి.
-ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటను మీడియంలో ఉంచి ఒత్తుకున్న చెక్కలను ఆయిల్ లో వేసి వేయించుకోవాలి.కొద్దిగా కలర్ మారిన తర్వాత వాటిని బాండీలో నుంచి బయటకు తీసేయండి. అంతే కరకరలాడే పప్పు చెక్కలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications