Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
పైన కరకర.. లోపల జ్యూసీగా..స్వీట్ షాప్ స్టైల్ మడత కాజా ఎలా చేసుకోవాలంటే
స్వీట్లలో మడత కాజాకు ఉన్న క్రేజ్ వేరు. పైన కరకరలాడుతూ, లోపల పంచదార పాకం నిండి జ్యూసీగా ఉండే ఈ మిఠాయిని ఒక్కసారి రుచి చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. తాపేశ్వరం, కాకినాడ ప్రాంతాల్లో పుట్టిన ఈ స్వీట్ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి అత్యంత ఇష్టమైనది. మడత కాజా ప్రత్యేకత అంతా దాని మడతలలోనే ఉంటుంది. మడత కాజా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
మైదా పిండి - 2 కప్పులు (250-300 గ్రా)
నెయ్యి- పావు కప్పు
వంట సోడా - చిటికెడు
ఉప్పు - చిటికెడు
నీళ్లు - పిండి కలపడానికి సరిపడా
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
పంచదార - 2 కప్పులు
నీళ్లు - 1 కప్పు
యాలకుల పొడి - 1 టీస్పూన్
నిమ్మరసం - 1 టీస్పూన్
నూనె -డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో మైదా పిండిని జల్లించి తీసుకోండి. అందులో చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి బాగా కలపండి.
-ఇప్పుడు కరిగించిన వేడి నెయ్యిని పిండిలో వేసి చేత్తో బాగా కలపాలి. పిండిని చేతితో ముద్ద చేస్తే ముద్దలా నిలబడాలి.
-తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ పిండి ముద్దపై తడి గుడ్డ కప్పి 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
-ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల బియ్యం పిండి వేసి క్రీమ్ లాగా పేస్ట్ చేసుకోవాలి.
-ఇప్పుడు నానిన పిండిని తీసుకుని, మరోసారి బాగా మర్దన చేయాలి. పిండిని పెద్ద ఉండలుగా విభజించుకోవాలి. ఒక ఉండను తీసుకుని చపాతీ కర్రతో వీలైనంత పల్చగా, దీర్ఘ చతురస్రాకారంలో చపాతీని ఒక వైపు నుంచి నెమ్మదిగా రోల్ చేస్తూ రావాలి. గాలి బుడగలు లేకుండా గట్టిగా చుట్టాలి. చుట్టిన రోల్ చివర్లో కొంచెం నీళ్లు రాసి అంచులు విడిపోకుండా అతికించాలి.
-ఇప్పుడు ఈ రోల్ ను చాకుతో 1 ఇంచు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ప్రతి ముక్కను వేలితో లేదా చపాతీ కర్రతో నిలువుగా కాస్త అదిమి కాజా ఆకారాన్ని ఇవ్వాలి.

-స్టవ్ మీద గిన్నె పెట్టి పంచదార, నీళ్లు పోసి మరిగించాలి. పంచదార కరిగాక, పాకం తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. రెండు వేళ్ళ మధ్య పాకం పట్టుకుంటే చిన్న తీగలా సాగాలి. మరీ ముదురు పాకం రాకూడదు, లేదంటే కాజా లోపలికి పాకం వెళ్లదు.
-పాకం రాగానే స్టవ్ ఆపేసి అందులో యాలకుల పొడి, నిమ్మరసం కలపాలి. పాకం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి.
-బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. మీడియం మంట మీద వేడిలో ఉండాలి. కాజాలను నూనెలో వేసినప్పుడు అవి వెంటనే పైకి తేలకూడదు. నెమ్మదిగా వేగాలి. మంటను సిమ్ లో పెట్టి కాజాలను వేయించాలి.
-కాజాలు బంగారు రంగులోకి వచ్చే వరకు ఓపికగా వేయించి తీయాలి. నూనెలోంచి తీసిన వేడి వేడి కాజాలను వెంటనే గోరువెచ్చని పంచదార పాకంలో వేయాలి. కాజాలను పాకంలో సుమారు 5 నిమిషాల పాటు ఉంచాలి. అప్పుడే పాకం లోపలి పొరల్లోకి వెళ్తుంది. తర్వాత వాటిని తీసి ప్లేట్ లో సర్వ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications