Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
వర్షాకాలానికి పర్ఫెక్ట్ స్పాక్..బయట క్రిస్పీగా,లోపల మెత్తగా..సగ్గుబియ్యం కట్ లెట్ ఎలా చేసుకోవాలంటే
మన వంటగదుల్లో ఉండే ముఖ్యమైన పదార్థాల్లో సగ్గుబియ్యం కూడా ఒకటి. దీనిని సాధారణంగా పాయసం చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సగ్గుబియ్యంతో కిచిడీ సహా అనేక వెరైటీ వంటకాలు కూడా తయారుచేస్తుంటారు. అయితే సగ్గుబియ్యం టిక్కీ ఎప్పుడైనా తిన్నారా? మహారాష్ట్రలో ఇది చాలా ఫేమస్. దీనిని తెలుగులో సగ్గుబియ్యం వడ లేదా సబ్బుబియ్యం కట్ లెట్ అని కూడా పిలుస్తారు. ఈ టిక్కీని సాధారణంగా ఉపవాసాల కోసం తయారు చేస్తారు. సగ్గుబియ్యం, బంగాళాదుంపలు,కొన్ని కారంగా ఉండే మసాలా దినుసుల రుచి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, మీరు దీన్ని మీకు కావలసినప్పుడు తయారు చేసుకోవచ్చు. మీకు కావాలంటే, మీరు దీన్ని పార్టీ స్నాక్ గా లేదా సాయంత్రం టీతో కూడా చేసుకోవచ్చు.
బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ టిక్కీ రెసిపీని తయారు చేయడం చాలా సులభం. ఈ టిక్కీని సాధారణంగా తవా మీద వేయించి తీసుకుంటారు, కానీ మీకు కావాలంటే మీరు దానిని కడాయిలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో మీరు కరకరలాడే, రుచికరమైన ఏదైనా తినాలని కోరుకుంటే తప్పకుండా సగ్గుబియ్యం టిక్కీని ప్రయత్నించండి. ఈ రుచికరమైన టిక్కీని ఇంట్లో సులభంగా తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

సగ్గుబియ్యం- 1/2 కప్పు
ఉడికించిన బంగాళాదుంపలు - 3
అల్లం తురుము- 3 టీస్పూన్లు
పచ్చిమిర్చి - 2 టీస్పూన్లు
తెల్ల నువ్వులు - 2 టీస్పూన్లు
ఉప్పు - రుచి ప్రకారం
మొక్కజొన్న పిండి - 1 టీస్పూన్
వేయించిన వేరుశనగ పప్పు - 6 టేబుల్ స్పూన్లు
నూనె-వేయించడానికి సరిపడా
సగ్గుబియ్యం టిక్కీ తయారీ విధానం
-సగ్గుబియ్యంను జల్లెడలో తీసుకుని నీటితో బాగా కడగాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో సగ్గుబియ్యంను అర కప్పు నీటిలో దాదాపు 6-8 గంటలు నాననివ్వండి.
-తర్వాత నానిన సగ్గుబియ్యం తీసుకొని వాటిని గుజ్జు చేయండి. తర్వాత ఉడికించిన బంగాళాదుంపలను ఒక గిన్నెలో మెత్తగా చేయాలి. ఇందులోనే నానబెట్టి మెత్తగా గుజ్జు చేసిన సగ్గుబియ్యం కూడా వేసి మొత్తం కలిసేలా కలపండి. ఇందులోనే అల్లం తురుము, పచ్చిమిర్చి వేయండి.
-అందులోనే తెల్ల నువ్వులు, ఉప్పువేసి బాగా కలిపి, వాటిని పిండిలాంటి స్థిరత్వం వచ్చేలా చేయాలి. తర్వాత ఇందులో ఇప్పుడు వేరుశెనగ పప్పు, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సమాన భాగాలుగా విభజించి, రెండు అరచేతుల మధ్య సున్నితంగా నొక్కడం ద్వారా వాటిని చదును చేయండి.
-ఒక పాన్ లో నూనె వేడి చేయండి. వేడెక్కిన ఆయిల్ లో ఈ టిక్కీలను వేసి వేయించాలి. వాటిని గరిటతో మార్చుతూ వేయించుకుంటూ ఉండండి.
-రెండు వైపులా లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించి, గ్యాస్ ఆపివేసి, టిక్కీలను ప్లేట్ మీద ఉంచండి. అంతే సగ్గుబియ్యం టిక్కీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications