Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
బయట క్రిస్పీ,లోపల సాఫ్ట్..మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే పకోడీ తయారీ ఇలా
చాలామంది ఇళ్లల్లో మధ్యాహ్నం భోజనం తర్వాతో లేదా రాత్రి డిన్నర్ తర్వాతో గిన్నెలో అన్నం మిగిలిపోవడం సర్వసాధారణం. చాలాసార్లు ఆ మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేయాలో తెలియక, అది పాడైపోతుందేమోనని భావించి మనసు ఒప్పుకోకపోయినా చెత్తబుట్టలో పారేస్తుంటాం లేదా అయిష్టంగానే చల్ది అన్నం తింటుంటాం.
మిగిలిపోయిన అన్నంతో కేవలం పది నిమిషాల్లో లొట్టలేసుకుంటూ తినేలా అద్భుతమైన, కరకరలాడే పకోడాలను తయారు చేసుకోవచ్చు. ఈ రైస్ పకోడాలు బయట క్రిస్పీగా, లోపల మృదువుగా ఉంటూ, పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటాయి. మిగిిపోయిన అన్నంతో పకోడీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
వండిన అన్నం: 2 కప్పులు
బంగాళాదుంపలు: 2
శనగపిండి లేదా బియ్యం పిండి:3 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ: 1
క్యారెట్: 1
క్యాప్సికమ్: 1
పసుపు: అర టీస్పూన్
ఎర్ర కారం: తగినంత
గరం మసాలా: కొద్దిగా
ధనియాల పొడి: కొద్దిగా
ఉప్పు: తగినంత
పచ్చిమిర్చి:సరిపడా
కొత్తిమీర: కొద్దిగా
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో మిగిలిపోయిన అన్నాన్ని వేసి మీ చేతులతో మెత్తగా చిదుముకోవాలి. అన్నం మెతుకులు మరీ విడివిడిగా ఉండకూడదు.
-ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను వేసి బాగా కలపాలి. బంగాళాదుంపలు పకోడాలు విడిపోకుండా ఉండటానికి, తినేటప్పుడు మృదుత్వాన్ని ఇవ్వడానికి సహాయపడతాయి.
-ఇప్పుడు అన్నం, బంగాళాదుంపల మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తురిమిన క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి వేయాలి. ఆ తర్వాత పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
-మిశ్రమం కొంచెం జారుగా లేదా తడిగా అనిపిస్తే అందులో 2-3 స్పూన్ల శనగపిండి లేదా బియ్యం పిండిని కలపండి. ఇది పకోడాలు నూనె పీల్చకుండా, కరకరలాడేలా చేస్తుంది. ఈ పిండిని కలిపేటప్పుడు నీటిని అస్సలు ఉపయోగించవద్దు. మరీ అవసరమైతేనే ఒకటి రెండు చుక్కల నీరు చల్లుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె బాగా కాగిన తర్వాత మంటను మీడియంకి తగ్గించండి.
-ఇప్పుడు సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా లేదా పకోడాల ఆకారంలో నూనెలో వేయండి. మీడియం మంటపై పకోడాలు బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు, రెండు వైపులా తిప్పుతూ వేయించుకోవాలి.
-బాగా వేగింది అనుకున్నాక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకుంటే అదనపు నూనె పోతుంది. అంతే వేడి వేడి, కరకరలాడే రైస్ పకోడాలు రెడీ. వీటిని స్పైసీగా ఉండే పుదీనా చట్నీతో గానీ, పిల్లలకైతే టమాటా కెచప్ తో గానీ సర్వ్ చేయండి అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications