నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా

Posted By:

ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమవనున్నాయి. ఈ సమయంలో భక్తులు తొమ్మది రోజులు ఉపవా దీక్షలు చేస్తారు. ఈ తొమ్మిది రోజుల కఠిన ఉపవాస దీక్షలో, సాయంత్రం వేడి వేడి టీతో పాటు కరకరలాడే, రుచికరమైన స్నాక్స్ ఏమైనా తింటే బాగుండు అని అందరికీ అనిపిస్తుంది. కానీ మార్కెట్లో దొరికే చిప్స్, పాపడ్స్ లో సాధారణ ఉప్పు, అనారోగ్యకరమైన నూనెలు, రసాయనాలు కలుపుతారు కాబట్టి, వాటిని ఉపవాస సమయంలో తినడం ఏమాత్రం సురక్షితం కాదు.

అందుకే కేవలం ఒకే ఒక కప్పు సగ్గుబియ్యంతో, 100 శాతం స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, కరకరలాడే పాపడ్‌ లను మన ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వంట రాని వారు, మొదటిసారి చేసేవారు కూడా ఏమాత్రం చిరగకుండా, తెల్లగా, గాజులా మెరిసే పారదర్శకమైన పాపడ్‌ లను ఈ పద్ధతితో ఈజీగా చేసేయొచ్చు.

Crispy Saggubiyyam Papad for Navaratri Fasting Easy Sabudana Recipe

కావలసిన పదార్థాలు

సగ్గుబియ్యం- 1 కప్పు
నీళ్లు - 4 కప్పులు
రాతి ఉప్పు- 1 టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
మిరియాల పొడి లేదా దంచిన పచ్చిమిర్చి - అన టీస్పూన్
కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్

ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా..

తయారీ విధానం

-ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రమైన నీటిలో రెండుసార్లు కడగాలి. ఆ తరువాత, అందులో అర కప్పు నీళ్లు పోసి మూతపెట్టి 3 నుండి 4 గంటల పాటు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం ఉబ్బి, మెత్తగా మారతాయి.

-తర్వాత ఒక మందపాటి అడుగు ఉన్న గిన్నె తీసుకుని, అందులో 4 కప్పుల నీళ్లు, ఒక స్పూన్ రాతి ఉప్పు వేసి బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేయాలి. మంటను తక్కువగా ఉంచి, అడుగంటకుండా గరిటెతో నిరంతరం కలుపుతూ 10-12 నిమిషాల పాటు ఉడికించాలి.

-కొద్దిసేపటికి సగ్గుబియ్యం గింజలు ఉడికి గాజు పూసల్లా పారదర్శకంగా మారతాయి. పిండి చిక్కబడి, మెరుస్తూ గరిటెకు అంటుకుంటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో జీలకర్ర, మిరియాల పొడి, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. దీన్ని కాస్త చల్లారనివ్వాలి.

-ఎండ తగిలే చోట లేదా ఫ్యాన్ కింద ఒక శుభ్రమైన ప్లాస్టిక్ కవర్‌ ను పరిచి, దానికి కొద్దిగా నూనె లేదా నెయ్యి రాయాలి. చిన్న గరిటెతో సగ్గుబియ్యం మిశ్రమాన్ని తీసుకుని కవర్‌ పై చిన్న చిన్న అట్లులా పోయాలి. పాపడ్లను మరీ పలుచగా పోయకూడదు, ఎందుకంటే ఆరిన తర్వాత అవి విరిగిపోయే ప్రమాదం ఉంది.

-ఈ పాపడ్లను ఒకటి లేదా రెండు రోజుల పాటు మంచి ఎండలో బాగా ఆరబెట్టాలి. అవి ఆరిన తర్వాత గట్టిపడి, పారదర్శకంగా అద్భుతంగా తయారవుతాయి.

-బాండీలిలో నూనె వేడి చేసి, ఈ ఆరిన పాపడ్లను వేయగానే, అవి పరిమాణంలో రెట్టింపు ఉబ్బి, భలే కరకరలాడుతూ నోరూరిస్తాయి.

-బాగా ఎండిన ఈ సగ్గుబియ్యం పాపడ్లను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే, సంవత్సరం పొడవునా పాడవకుండా ఫ్రెష్‌ గా ఉంటాయి.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 30, 2026, 22:11 [IST]
Desktop Bottom Promotion