Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
ఆంధ్రా స్టైల్ క్రిస్పీ స్నాక్..పెసర గారెలు క్రిస్పీగా,రుచికరంగా ఎలా చేయాలో చూడండి
భారతీయ వంటకాలలో ఎన్నో రకాల స్నాక్స్ ఉన్నప్పటికీ కొన్నింటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి వాటిలో పెసర గారెలు ఒకటి. ఇవి ప్రధానంగా పెసర పప్పుతో తయారుచేసే కరకరలాడే వంటకాలు. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో ఇవి చాలా పాపులర్. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా, సాయంత్రం టీ సమయాల్లో చిరుతిండిగా లేదా పండుగలు, శుభకార్యాలలో ప్రత్యేక వంటకంగా వీటిని తయారుచేస్తుంటారు. పెసర గారెలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన వంటకం. బియ్యప్పిండి కలిపి లేదా కలపకుండా కేవలం పెసర పప్పుతోనే వీటిని తయారుచేయవచ్చు. వీటిని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
పెసర గారెలు తయారీకి కావలసిన పదార్థాలు
-పొట్టు తీసిన పెసర పప్పు: 1 కప్పు (200 గ్రాములు)
-పచ్చిమిర్చి: 3-4
-అల్లం: 1 అంగుళం ముక్క
-జీలకర్ర: 1 టీస్పూన్
-ఉల్లిపాయ: 1 పెద్దది
-కరివేపాకు: 1 రెమ్మ (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
-కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
-ఉప్పు: రుచికి సరిపడా
-నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
-బియ్యప్పిండి: 1-2 టేబుల్ స్పూన్లు
-ఇంగువ: చిటికెడు

తయారీ విధానం
-ముందుగా పెసర పప్పును ఒక గిన్నెలోకి తీసుకుని 3-4 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన పప్పును కనీసం 4-5 గంటలు లేదా రాత్రంతా నీటిలో నానబెట్టాలి.
-నానిన పెసర పప్పును నీటిని వడకట్టి మిక్సీ గిన్నెలో వేయండి. ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి కాస్త గరుకుగా రుబ్బుకోవాలి. గారెలు కరకరలాడాలంటే పిండి మరీ మెత్తగా ఉండకూడదు.
-రుబ్బిన పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. గారెలు మరింత కరకరలాడాలనుకుంటే ఈ దశలో 1-2 టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపవచ్చు. ఇంగువ కూడా ఈ సమయంలో కలుపుకోవచ్చు.
-పిండిని సుమారు 5-10 నిమిషాలు చేతితో బాగా గిలకొట్టాలి. ఇలా చేయడం వల్ల పిండిలో గాలి చేరి గారెలు లోపల మెత్తగా, పైన క్రిస్పీగా వస్తాయి.
-ఒక కడాయిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యేలోపు ఒక ప్లాస్టిక్ షీట్ లేదా అరటి ఆకును తీసుకుని దానికి కొద్దిగా నూనె రాయాలి.
-చేతిని కొద్దిగా నీటితో తడుపుకుని రుబ్బిన పిండిలోంచి చిన్న నిమ్మకాయంత ముద్దను తీసుకుని నూనె రాసిన షీట్‌పై పెట్టి వేళ్లతో నెమ్మదిగా వట్టి పల్చటి గుండ్రటి గారెలా ఒత్తాలి. మధ్యలో చిన్న రంధ్రం చేసుకోవాలి. మెల్లిగా గారెను షీట్ నుండి తీసి, వేడెక్కిన నూనెలో వేయండి. అంతే పెసర గారెలు రెడీ.
-వేడి వేడి పెసర గారెలను అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ లేదా పుదీనా చట్నీతో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications