Latest Updates
-
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
తింటున్న కొద్దీ ఇంకా ఇంకా అనిపించే కజ్జికాయలు..పర్ఫెక్ట్ టేస్ట్ తో ఎలా చేసుకోవాలంటే..
రతీయ సాంప్రదాయ వంటకాల్లో కజ్జికాయలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాల సమయంలో తెలుగు రాష్ట్రాల్లో బెల్లం కజ్జికాయలు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. కజ్జికాయలు రకరకాలుగా చేస్తుంటారు. బెల్లం కజ్జికాయలు కేవలం ఒక తీపి వంటకం మాత్రమే కాదు, ఇది పోషకాల నిలయం. పండుగలప్పుడు ఆనందంగా తినడమే కాకుండా, రోజువారీ జీవితంలో కూడా అప్పుడప్పుడు స్నాక్ గా తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ బెల్లం కజ్జికాయలు ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
బెల్లం కజ్జికాయలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-మైదాపిండి
-నెయ్యి
-పల్లీలు
-పుట్నాల పప్పు
-నువ్వులు
-బెల్లం తరుము
-యాలకల పొడి
-నూనె

బెల్లం కజ్జికాయలు తయారీ విధానం
-తింటున్న కొద్దీ ఇంకా ఇంకా అనిపించే కజ్జికాయలు..పర్ఫెక్ట్ టేస్ట్ తో ఎలా చేసుకోవాలంటే..
-ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో పావుకేజీ మైదాపిండి వేయండి. ఇందులో కరిగించిన 3 టేబుల్ స్పూన్ల వేడి వేడి నెయ్యి వేసి బాగా కలుపుకోండి.
-అందులోనే తగినంత నీళ్లు పోసి పిండిని మెత్తగా వత్తుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 కప్పు వేరుశెనగపప్పు వేసి తక్కువ మంటమీద వేయించి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో అరకప్పు నువ్వులు వేసి కొంచెం నీళ్లు చిలకరించి వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించి పొట్టు తీసిన పల్లీలు,అరకప్పు ఎండుకొబ్బరి పొడి, 1 కప్పు పుట్నాల పప్పు, వేయించిన నువ్వులు, పావు కేజీ బెల్లం తురుము వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
-మెత్తగా చేసుకున్న పొడిలో 1 టీస్పూన్ యాలకల పొడి వేసి బాగా కలునుకోవాలి.
-ఇప్పుడు వత్తుకొని పక్కన పెట్టుకున్న పిండిని మళ్లీ ఒకసారి వత్తుకొని చిన్న చిన్న బాల్స్ గా చేసుకోండి.
-ఈ బాల్స్ ని కొంచెం పిండి చల్లుకుంటూ పల్చటి రోటీల్లా వత్తుకోండి.
-ఇప్పుడు కజ్జికాయల బౌల్ లో కాస్త పిండిని చల్లి దానీమీద పల్చగా రోటీలా వత్తుకున్న దానిని పెట్టి అందులో గ్రైండ్ చేసి ఉంచుకున్న పల్లీ,పుట్నాల పొడి పెట్టి అంచుల వెంట తడి చేసి దానిన కజ్జికాయలా వత్తుకోండి.
-తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చేసి ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ లోకి మారిన వెంటనే తీసేయాలి. అంతే టేస్టీ కజ్జికాయలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
