Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
ధాభా స్టైల్ ఎగ్ ఖీమా మసాలా..అబ్బబ్బా ఏం ఉంటది నా సామిరంగా..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
భారతీయ వంటకాలలో గుడ్లతో చేసే వంటకాలు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. గుడ్లు, సుగంధ ద్రవ్యాలు మరియు తాజా కూరగాయలతో కలిపి తయారుచేసే ఎగ్ ఖీమా మసాలా ఒక అద్భుతమైన వంటకం. దీనిని పరాటాలు, రోటీలు, నాన్లు లేదా అన్నంతో కలిపి తినవచ్చు. ఈ వంటకం కేవలం రుచికరమైనదే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. 'ఖీమా' అనే పదం సాధారణంగా ముక్కలు చేసిన మాంసాన్ని (కీమా) సూచిస్తుంది. అయితే ఎగ్ ఖీమాలో ఉడికించిన గుడ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసిలేదా వాటి తురుమును మసాలా గ్రేవీలో కలుపుతారు. ఇది సాధారణ గుడ్డు కూరల కంటే భిన్నమైన రుచిని అందిస్తుంది. ఎగ్ ఖీమా మసాలాని మీ ఇంట్లోనే ధాభా స్టైల్ లో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఎగ్ ఖీమా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు
-గుడ్లు: 6-8
-ఉల్లిపాయలు: 2
-టమాటాలు: 2
-అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
-పచ్చిమిర్చి: 2-3
-నెయ్యి: 3-4 టేబుల్ స్పూన్లు
-ఆవాలు: 1/2 టీస్పూన్
-జీలకర్ర: 1/2 టీస్పూన్
-కరివేపాకు: కొన్ని రెబ్బలు
-పసుపు: 1/2 టీస్పూన్
-కారం పొడి: 1-1.5 టీస్పూన్
-ధనియాల పొడి: 1.5 టీస్పూన్
-జీలకర్ర పొడి: 1 టీస్పూన్
-గరం మసాలా: 1 టీస్పూన్
-ఉప్పు: రుచికి సరిపడా
-నీరు: 1/2 కప్పు లేదా అవసరమైనంత
-కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు

ఎగ్ ఖీమా మసాలా తయారీ విధానం
-ముందుగా గుడ్లను గట్టిగా ఉడికించి చల్లబరచి పొట్టు తీసి వాటిని తురుముకొని పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి.
-ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయేవరకు ఒకటి రెండు నిమిషాలు వేయించుకోండి.
-తర్వాత అందులో తరిగిన టమాటాలు వేసి మెత్తబడే వరకు, నూనె పైకి తేలే వరకు ఉడికించండి. ఇప్పుడు పసుపు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపండి. మసాలాల పచ్చి వాసన పోయేవరకు ఒకటి రెండు నిమిషాలు వేయించుకోండి.
'గోబీ ఖీర్' తో బక్రీద్ 2025 ని సెలబ్రేట్ చేయండి..నోట్లో పెట్టుకుంటే అమృతమే..ఎలా చేయాలంటే
-అందులో అర కప్పు నీరు వేసి మసాలాను బాగా కలపండి. గ్రేవీ చిక్కబడే వరకు, నూనె పైకి తేలే వరకు ఉడికించండి.
-గ్రేవీ చిక్కబడిన తర్వాత ఇందులో తురుముకున్న గుడ్లను వేసి బాగా కలపండి. మసాలా గుడ్ల తురుముకి పట్టేలా ఒకటి రెండు నిమిషాలు ఉడికించండి.
-చివరిగా గరం మసాలా వేసి బాగా కలపండి. కొత్తిమీరతో అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.
-ఎగ్ ఖీమా మసాలాను పరాటాలు, నాన్లు, రోటీలు, చపాతీలు లేదా సాధారణ అన్నంతో కలిపి తినవచ్చు. కొంతమంది దీనిని బ్రెడ్ టోస్ట్ పైన కూడా తింటారు. ఇది అల్పాహారానికి, మధ్యాహ్న భోజనానికి లేదా నైట్ డిన్నర్ కి బెస్ట్ ఆప్షన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications